Monday, April 2, 2007

హైదరాబాద్ లో ఐ.ఎస్.ఐ ఏజెంటు అరెస్టు. - మానవ బాంబు బృంద ప్రవేశం.

ఇస్లామిక్ తీవ్రవాదులు - సెక్యులర్ భాషలో చెప్పాలంటే ఐ.ఎస్.ఐ ఏజెంట్లు - ఢిల్లీ నుంచి గల్లీ దాక పాకిపోయారు. వాళ్ళకి ఇవ్వ బడుతున్న ట్రైనింగ్ ఒకటే - "కాఫిర్" లను చంపాలి; అట్లా చంపితే స్వర్గం లో స్పెషల్ బెర్తు గ్యారంటీ. - అలా ఆ నెట్‌వర్క్ విస్తరిస్తుంటే మనమేమో అదెమీ తెలియనట్టు క్రికెట్ మునిగి తెలుతాం, క్రికెటర్ల దిష్టి బొమ్మలు కాల్చుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతాం.

ఇక్కడ నాకొక డౌటు. తీవ్రవాదుల దృష్టిలో హిందువులు ఎంత కాఫిర్లో, క్రిష్టియన్లూ అంతే కాఫిర్లు కదా. విగ్రహారధకులని చంపాలి అన్న సిద్దాంతం పట్ల వాళ్ళకి అంత నిబద్దతే వుంటే మరి చర్చిల మీద ఎందుకు దాడులు జరగట్లేదు. అపార్థం చేసుకోకండి - నా వుద్దేశం వాటి మీద కూడా జరగాలి అని కాదు. హిందువుల మీద హిందూ, దేవాలయాల మీదే ఎందుకు జరుగుతున్నాయి? అని.
వాళ్ళకు ఏమన్నా ప్రత్యేకమైన అదేశాలు వున్నాయా ఈ రెండో వర్గం జోలికి వెళ్ళద్దని? వుంటే, ఎవరు ఇచ్చి వుంటారు? అదేశాలు ఎలా వుండి వుంటాయి. నా గెస్‌లు...
1) "మీరు ఎమన్నా చేసుకోండి. కానీ "మా వాళ్ళ" జోలికి వెళ్ళకండి"
2) "అక్కడ (ఇండియా లో) మీ వాళ్ళని ఎమన్నా చేయ్యనివ్వండి. కానీ "మా వాళ్ళ" జోలికి వెళ్ళకుండా చూసుకోండి"
3) "మేము చెప్పినట్టు గా అక్కడకి తీవ్రవాదుల్ని పంపండి. కానీ మా వాళ్ళకి ఏమీ కాకూడదు"
4) లేక పొతే మన అంతఃశ్శత్రువులే ఎమన్నా లోపాయకారీ ఒప్పందం చేసుకున్నారా?

మన దేశం లో వున్న టెర్రరిస్టుల వెనుక పాకిస్తాన్ ఒక్కటే వుందంటే నాకు నమ్మ బుద్ది కావట్లేదు.
వాళ్ళు ఎన్నన్నా చెయ్యనీ, మన సిగ్గులేని ప్రభుత్వం పాకిస్తాన్ తో "కలిసి" ఉగ్రవాదం పై పోరాడుతుందట. ఈ డైలాగ్ కూడ ఎవరు చెప్పించారో మన వాళ్ళతో?
వోట్లు అడగటానికి వాళ్ళకి సిగ్గు లేదు. అడిగినప్పుడల్లా వెయ్యటానికి నా లాంటి జనానికి బుద్ది లేదు.

అవునూ ఇంతకీ వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారంటారూ? మీ ఒపీనియన్ ఎమిటో?

8 comments:

సత్యసాయి కొవ్వలి Satyasai said...

అవన్నీ ఓకే. నాకు మీరిచ్చిన సాయి మాస్టర్ లంకె చాలా ఆనందం కలగ చేసింది. కృతజ్ఞతలు.

Dreamer said...

నాకు తెలిసినంతవరకూ ముస్లిములు జీసస్ ని ప్రొఫెట్ గా అంగీకరిస్తారు, కాకపోతే ఆయన్ని దేవుడి కొడుకని చెప్పుకోవడంలోనే ముస్లిములకీ క్రిష్టియన్లకీ గొడవ వస్తుంది. పైగా క్రిష్టియానిటీలో కూడా విగ్రహారాధనలేదు. అందుకే ముస్లిముల దౄష్టిలో క్రిష్టియన్లు కాఫిర్లు కారనుకుంటా.

Anil Dasari said...

తీవ్రవాదుల దాడులు క్రిస్టియన్ల మీదా జరుగుతూనే ఉన్నాయి. భారతదేశం ప్రధానంగా హిందూ దేశం కాబట్టి ఇక్కడ దాడులు వీళ్ల మీద కేంద్రీకృతమయ్యాయి. అమెరికా, ఇంగ్లాండ్ వంటి క్రైస్తవ దేశాలూ ఇస్లామిక్ తీవ్రవాదం బాధితులే. కాకపోతే అక్కడ మన దేశంలో జరిగినన్ని దాడులు జరగకపోవటానికి వాళ్ల పటిష్టమైన భద్రతా వ్యవస్థ కారణం. అంతే తేడా.

మతాల ప్రస్తావనొచ్చింది కాబట్టి ఉదాహరణల కోసం పైదంతా చెప్పా. అసలు తీవ్రవాదులకి మతంతో పనేంటి? వాళ్ల తుపాకులకి హిందువైనా, ముస్లిమైనా, క్రిస్టియనైనా లేడా లేదు. అందరూ సమానమే.

Kathi Mahesh Kumar said...

తీవ్రవాదుల ఉద్దేశం చంపడం, భయాన్ని సృష్టించడం. దానికి మతపరమైన ముసుగుని తొడుక్కున్నంతమాత్రానా అది మత పోరాటం అయిపోదు. వారికి మతం లేదు...మానత్వం అంతకన్నా లేదు.

చదువరి said...

తీవ్రవాదులు చేస్తున్నది ఖచ్చితంగా మతం పేరిట పోరాటమే!

ప్రపంచంలో ఏ మూలో ఎవడో ఒకడు ఇస్లాం పేరు చెప్పి బాంబులేసాడనుకోండి.. అప్పుడనొచ్చు-"మతం అనేది ముసుగే, తీవ్రవాదికి మతమేంటీ" అని. కానీ ఈ ఇస్లామిస్టు ఉగ్రవాదులు ప్రపంచంలో ఏ మూల బాంబులేసినా ఇదే మాట చెబుతుంటే, దాన్ని కూడా ఇలాగే అనుకోవడం.. అంత సబబు కాదేమోననిపిస్తోంది!

ఇస్లామ్ పేరిట బాంబులేస్తున్నారని అన్నారుగానీ... ముస్లిములంతా అలాంటివారేనని అనలేదుగా! ఇస్లాం మతస్తులంతా ఆ బాపతేనని అనలేదుగా!

ఇస్లామిక తీవ్రవాదమని అనకూడదని సమర్ధించుకువచ్చే వాళ్ళు 'ముస్లిములంతా మతవాద ఉగ్రవాదులేనని ప్రజలంతా అనుకుంటున్నారు' అనే భావనని అన్యాపదేశంగా ముస్లిముల్లో కలగజేస్తున్నారు. ఈ రకం సమర్ధనలు ముస్లిములకు ఎంత నష్టం కలగజేస్తున్నాయో ఆలోచించరు. ముస్లిము తీవ్రవాదుల్ని విమర్శిస్తే ముస్లిములందరినీ విమర్శించినట్టు కాదుగదా.

Anonymous said...

"వాళ్ళకు ఏమన్నా ప్రత్యేకమైన అదేశాలు వున్నాయా ఈ రెండో వర్గం జోలికి వెళ్ళద్దని? వుంటే, ఎవరు ఇచ్చి వుంటారు? అదేశాలు ఎలా వుండి వుంటాయి. నా గెస్‌లు...
1) "మీరు ఎమన్నా చేసుకోండి. కానీ "మా వాళ్ళ" జోలికి వెళ్ళకండి"
2) "అక్కడ (ఇండియా లో) మీ వాళ్ళని ఎమన్నా చేయ్యనివ్వండి. కానీ "మా వాళ్ళ" జోలికి వెళ్ళకుండా చూసుకోండి"
3) "మేము చెప్పినట్టు గా అక్కడకి తీవ్రవాదుల్ని పంపండి. కానీ మా వాళ్ళకి ఏమీ కాకూడదు"


నాకిట్లాంటి wild thoughts/guesses ని చూస్తుంటే అంతకు ముందు ఆవేశ పడే వాన్ని కాని, ఇప్పుడు మాత్రం చాలా amusing గా ఉంటుంది.

Keep going Manyava..Reveal yourself..that would be entertaining...

ఇట్లాంటి wild conspiratory crap theories propose చేసే ముందు, "వాళ్ళకి" basic motive ఏంటి అని ఆలోచిస్తారా సార్ మీరు?

Dreamer said...

ఏడాదికాలంగా నిద్రపోతున్న టపాని కాష్మోరాని లేపినట్టు నిద్రలేపినట్టున్నాను :)

చదువరి said...

Motorolan: :)


Free Blogger Templates by Isnaini Dot Com and Flowers and Decors. Powered by Blogger