Wednesday, April 4, 2007

మీకేంటండీ...సాఫ్టువేరు...!!

"ఓ మీరా!! రండి..రండి..ఆ..! బావున్నారా?.. కూర్చోండి..రా బాబూ కూర్చో"

"బావున్నామండీ..మీరు బాగున్నారా?"

"ఆ బావున్నాం.. ఇతనెవరూ?"
...
"మా వాడే...కంప్యూటరు"
...
"మా అక్క కొడుకు...సాఫ్టువేరు"
...
"మా అన్నయ్యగారి అబ్బాయి..హైటెక్ సిటీ లో సాఫ్టువేరు ఉద్యోగం"
...
లేక పోతే "....కంప్యూటరు మీద పని చేస్తున్నాడు..హైదరాబాదులో"

ఇవీ నాకు దొరికే ఇంట్రడక్షన్లు ...

ఇక నెక్స్ట్ ప్రశ్న..

"సాఫ్టువేరంటే బానే ఇస్తారుగా...ఎంతిస్తారో.."
....
"ఎంతొస్తయి బాబూ"
...
"ముప్ఫయి వేలండీ.."
.....
"అబ్బా!! అంతిస్తారా? అసలు మీరు ఏం చేస్తారు? కంప్యూటర్లు తయారు చేస్తారా?"
....
"అన్ని డబ్బులు ఎంజేస్తారు?"
...
"ఇద్దరూ కంప్యూటరు ఉద్యోగాలేగా!! ఇంక మొత్తం సేవింగ్సే అన్న మాట!!"
...
ఎదవ దొబ్బుడు..
....
ఇక రియల్ ఎస్టేట్ వాళ్ళు - "అబ్బా!! అంత రేటా?" అంటే "మీకేంటి సార్ సాఫ్టువేర్ జాబు"
....
ఆటో వాళ్ళు అల్టిమేట్

కొత్తగూడా క్రాస్ రోడ్ నుంచి విప్రో కి 10 రూపాయలు. అదే దూరం ఉప్పల్ రోడ్ లో అయితే 4 రూపాయలు.

అదేమంటే మళ్ళీ స్టార్టు.."మీకేంటండి..." "మీరే ఇవ్వక పొతే ఎట్లా?"
మాములు ఉద్యోగం చేసే వాళ్ళు ఎక్కితే వాళ్ళనీ పీడిస్తారు "అదిగో వాళ్ళు ఇస్తున్నారు..మీరు ఇవ్వండి" అని.

విప్రో నుంచి కాన్‌బే కి 3 రూ. కాని కొత్తగూడా క్రాస్ రోడ్ నుంచి కాన్‌బే కి 15.

కూకట్‌పల్లి నుంచి హైటెక్ సిటీ కి 10 రూ. అది 10KM డిస్టెన్శ్.
హైటెక్ సిటీ నుంచి 1 KM దూరంలో వున్న వానెన్‌బర్గు కి 5 రూ.

అడిగితే "మీరు కూడా ఇవ్వక పొతే ఎట్లా?" అంటారు..

మా ఆవిడ కి చివరికి విరక్తి వచ్చింది. అందుకే ఇక డిసైడ్ అయ్యింది- ఇక ముందు నుంచి ఎవరన్నా అడిగితే "మార్కెటింగ్", "ఫాకల్టీ", ఇట్లాంటివి చెప్పాలని.
.........
అదేమి విచిత్రమో కానీ ఐటి సందట్లో అసలు లాభ పడుతున్న రియల్ ఎస్టేట్ వాళ్ళ గురించి ఎవరూ మాట్లడరు. అందరి నోళ్ళలో పడేది నా లాంటి ఐటి బకరాలే.
......
అసలు ట్రాజెడీ ఏమిటంటే నేనూ, చాలా మంది నా ఐటి ఫ్రెండ్సూ నెలాఖరుకి "ఎవడు అప్పు ఇస్తాడా?" అని చూస్తూ వుంటాము.
మేము సంపాదిస్తున్నవి "క్రెడిట్ కార్డు బిల్లులు, నిల్లు బాంకు బాలెన్సులు".

4 comments:

cbrao said...

"మేము సంపాదిస్తున్నవి "క్రెడిట్ కార్డు బిల్లులు, నిల్లు బాంకు బాలెన్సులు". - ఎక్కడో ఎదో లోపం ఉంది.నాకు తెలిసిన వారంతా savings ని జాగ్రత్తగా real estate లో మదుపు చేస్తూ చిన్న వయస్సులో పెద్ద ఇంటికి యజమానులవ్వుతున్నారు.

రాధిక said...

నిజమే సాఫ్ట్ వేర్ అన్నవాళ్ళని అన్ని రకాలుగా చావ దొబ్బడం మామూలే.నేనూ మావార్ని అలాగే చెప్పమనేదానిని.కానీ ముపై వేలు జీతం అందుకుంటూ నెలాఖరుకు అప్పుల కోసం చూస్తున్నారంటే రావు గారన్నట్టు మీలో లోపమే.క్రెడిట్ కార్డుల బిల్లంటే అది మీరు ఖర్చు చేయకుండా రాలేదుగా.క్లాస్ తీసుకుంటున్నాననుకోపోతే ఇప్పటినుండయినా పొదుపు చేయండి. ఇప్పుడొస్తుందింకదా అని ఖర్చు చేస్తూ పోతే రేపు రానప్పుడు పరిస్తితి ఏమిటి?ఇప్పటి నవతరం అంతా ముప్పయిల వయసు దాటకుండానే జీవితం లో అన్ని రకాలు గా స్తిరపడిపోతున్నారు. మనం వెనకపడిపోకూడదు కదా.

Unknown said...

బెంగుళూరు లోనూ అదే పరిస్థితి. ఉంటే గింటే హైదరాబాదు కంటే కూడా దారుణం.

రియల్ ఎస్టేట్ వారు దోచినట్టుగా ఇంకెవరూ దోచుకోరేమో.
అదీనూ ఇప్పుడు వడ్డీ రేట్లు పెరగడంతో లోన్లు తీసుకున్నవారంతా (నేను కూడా) ఇరకాటంలో పడ్డారు.

రానారె said...

సంపాదిస్తున్నవారి సంగతి సరే. "అదిగో వాళ్లిస్తున్నారుగా... మీరూ ఇవ్వండి" అనే మాటలు ఆటో డ్రైవర్ నోట విన్నప్పుడు సామాన్యుని గోడు ఎవరికి చెప్పుకోవాలి? ఆర్థిక అసమానతలు పెచ్చుమీరడం చాలా ప్రమాదకరం. హైదరాబాదు, బెంగుళూరి లాంటి నగరాల్లో కాస్త రంగున్న సెల్‌ఫోన్ పట్టుకు తిరిగే వానికి అడుగడుగునా ప్రాణగండం. నా ఉద్దేశంలో దీనికి ముఖ్య కారణం కేవలం విపరీతమైన అర్థిక అసమానతే. సహజంగా ఎంతో సహనం కలిగిన స్థానిక బెంగుళూరువాసులు "వాళ్లిస్తున్నారుగా..." డైలాగు వినీవివీ కడుపులు మండి, దీనికి కారణం - అక్కడ కొత్తగా చేరి "ఎంతైనా" ఇచ్చి తమకు కావలసింది సొంతం చేసుకోగల సాఫ్టు‌'వేరుపుగులే' అని తీర్మానించి తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. లేకపోతే వాళ్లంతా స్వతహాగా చాలా మంచి మనుషులు. సాప్ఠ్‌వీరులైనా, రియలెస్టేటు దారులైనా వారి సంపాదనల మీద ప్రభుత్వం అదుపు కలిగి ఆర్థిక అసమానతలు ప్రమాదకరమైన స్థాయికి చేరకుండా చూడాలి. ఈ మధ్యన డివిడెండ్ మీద పన్నువేసి ఒక మంచి పనే చేశారు. అలాగే రియల్ ఎస్టేటు ధనప్రవాహాన్ని కూడా తక్షణం నియంత్రించాల్సి ఉంది.


Free Blogger Templates by Isnaini Dot Com and Flowers and Decors. Powered by Blogger