Friday, April 20, 2007

Quote

He will, however, live forever on YouTube!! - sanjaya

Sunday, April 15, 2007

GIRISANTA

6. GIRISANTA

Among the 11 Rudras, the Rudra relating to speech is the most active one in the human being (remember that Rudra functions through the mind, the 5 sense organs and through the 5 physical organs of which speech is one). The Rudra that functions through the speech is called Girisanta. Girisanta means the one who bestows bliss through speech. Speech regulations are many (refer to the author’s book on “Sound”). Right speech which is harmonious builds harmonious energies in man. If not, speeches build conflict and its related worry, irritation, anger, etc. When speech is not harmonious, man transforms into a devil. When speech is harmonious, he can turn into a Deva. Horrible speeches would eventually lead one to horrible forms. Rudra, when worshiped, would arrest the tendency of abusive speech and would even liberate one to a state of harmonious speech and attractive form. With speech, one can destroy oneself or liberate oneself. One can throw oneself to hell or liberate oneself into heaven. Such is the power of speech. Such power is worshiped as Rudra.

Girisanta means the one who resides in speech. The use of speech is the use of Rudra’s power.


www.worldteachertrust.org

Saturday, April 14, 2007

డండడ డాండ డాండ

భండన భీముడార్త జన భాంధవుడుజ్వల బాణ తూణ కో
దండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామ మూర్తికిన్
రెండవ సాటి దైవమిక లేడనుచున్ కడ గట్టి భేరికా
డండడ డాండ డాండ నినదంబు లజాండము నిండ మత్త వే
దండము నెక్కి చాతెదను దాశరధీ కరుణా పయోనిధీ !!

Thursday, April 12, 2007

సంజయ మలకర్

చాలా భయంకరంగా తిట్టుకుంటునట్టున్నారు ఈ దేశీ బాయ్ ని అక్కడ.

చూ. Sick of Sanjaya? It's all Your fault

డిల్బర్ట్ బ్లాగ్ లో Most Useless Job in the Universe అనే పోస్టులో ఇచ్చిన ఒక ఉద్యోగం సంజయ మలకర్ కి "సంగీతం మేష్టారి" పని అట! :)

అమెరికా సోదరులెవరైనా కొంచం దీని గురించి పోస్టండి.

Tuesday, April 10, 2007

యండమూరి సినీ రంగ ప్రవేశం

ఇలా జరిగింది..

డాషర్

డాషర్ - చూడగానే నేను ఎంతో ఆశ్చర్యానికి లోనయిన inventions లో ఇదొకటి. అసలు టెక్స్ట్ ఎడిటర్లు ఇట్లాకూడా తయారు చెయ్యచ్చా అని పించింది. ఇందులో మామూలు టెక్స్ట్ ఎడిటర్ల లా తెల్ల స్క్రీన్ వుండదు; స్క్రీన్ కి ఒక మూల నుంచి అక్షరాలు వేగంగా వస్తూ వుంటాయి. కంటి కదలిక ద్వారా లెక, మౌస్ క్లిక్ ద్వారా, లేక ట్రాక్ బాల్ సహాయంతో మనం వ్రాయదలచుకున్న పదం లోని అక్షరాలని సెలెక్ట్ చేసుకోవాలి. అక్షరాలు స్క్రీన్ మీద ప్రత్యక్షం అయ్యే క్రమం మామూలు వర్ణ క్రమంలో ఉండదు. మనం ముందు సెలెక్ట్ చేసుకున్న అక్షరాలని బట్టి వాటికి దగ్గరగా వున్న పదాలలో వున్న అక్షరాలు వస్తాయి. ఉదా:- మనం ముందు h,e సెలెక్ట్ చేసామనుకోండి. తరువాత అది l చూపిస్తుంది. అది సెలెక్ట్ చేస్తే తరువాత l,o వరుసగా వస్తాయి. మన నోకియా లొ ఆటో వర్డ్ కంప్లీట్ లాగా అన్నమాట.

ఎక్కడైతే మామూలు కీ బోర్డ్ వాడటం కుదరదో అక్కడ ఇది విశేషంగా ఉపయోగ పడుతుంది. జాయ్ స్టిక్, ట్రాక్ బాల్, టచ్ సెన్సిటివ్ స్క్రీన్ లతో కంప్యూటర్ని ఉపయోగించాల్సిన సందర్భాలలో ఇది చాలా ఉపయోగం.

http://www.dasher.org.uk

Friday, April 6, 2007

దళిత తత్త్వం

దళితులుగా తమని భావించుకొనే వాళ్ళు -(అసలు ఈ పదం ఎట్లా పుట్టిందో దాని అర్ధం ఏమిటో నాకు తెలియదు)- చాలా మటుకు తాము ఎంతో కష్టాలు, అవమానాలు పడ్డాం అని అవేదన వ్యక్తం చేస్తుండటం మనం చూస్తున్నాం. ఇందులో భాగమే "దళిత కవిత్వం" అనబడే ట్రెండు. ఇవన్నీ చూస్తే ఎవరికన్నా ఏమని అనిపిస్తుందంటే భారత దేశం లో "అగ్ర" వర్ణాల వాళ్ళూ పచ్చి స్వార్ధపరులు, దయా దాక్షిణ్యాలు, మానవత్వం లేని వాళ్ళు అని.
ఎప్పుడూ కూడా అన్ని రకాల వాళ్ళూ సమాజం లో వుంటారు. కాకపోతే పర్సంటేజి లో మార్పు వుంటుంది. రామయణ కాలంలో 10% "చెడ్డ" వాళ్ళు వుంటే ఇప్పుడు 10% మాత్రమే "మంచి" వాళ్ళు కావచ్చు. "మంచి వాళ్ళము" అనుకొనే వాళ్ళలో కూడా అంతా మంచే వుండదు. మానవ సహజము, చుట్టూ వున్న సమాజ ప్రభావ జనితము అయిన దోషాలకు లోను అవ్వటం, తన చుట్టూ వున్న వాళ్ళు accept చేసే customs, behaviour patterns, attitudes అలవాటు చేసుకోవటం జరుగుతుంది. ఎందుకంటే "Behaviour is contagious" కాబట్టి.
సమాజం లో వుండే చెడుని గుర్తించే ఆలోచనా శక్తి, సంస్కారము , ఆ చెడుని ఎదిరించి నిలబడి కొత్త మార్గం చూపే శక్తి, సామర్థ్యం, నైతిక బలం అందరికీ వుండదు. అట్లాంటి వాళ్ళు చాలా కొద్ది మందే!!.

-మరి అట్లాంటి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇంత వరకూ ఈ దేశం లో పుట్టలేదా?
-అట్లాంటి వాళ్ళు కనీసం గడచిన 1000 సంవత్సరాలలో - అంబేద్కరు, జ్యోతీ రావు ఫూలే కంటే పూర్వం - ఒక్కడూ పుట్టలేదా?
-కనీసం 1% అగ్ర వర్ణాల వాళ్ళు కూడ మంచి వాళ్ళు లేరా?
-అంబేద్కరు కంటే ఎక్కువ కాక పోయినా కనీసం అయనతో సమానంగా దళితోద్ధరణకి పాటు పడిన మహాత్మా గాంధీ కి దళితోద్ధరణ ఉద్యమంలో అంతే పూజనీయ స్ఠానం ఇవ్వ బడుతున్నదా? లేక గాంధీ అగ్ర వర్ణపు వ్యక్తి కాబట్టి ప్రక్కన వుంచబడ్డాడా?
-అస్పృశ్యతా నివారణకై చరిత్ర లో జరిగిన ప్రయత్నాలు ఏమిటో తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారా?
-అట్లా చరిత్రలో అస్పృశ్యతా నివారణకి పాటు పడిన వాళ్ళ బోధనలని/ సందేశాలని ప్రచారం చేస్తున్నారా?
-వారు చేసిన మంచి పనులని గుర్తు చేసుకుంటున్నారా?
-కేవలం తమ కష్టాల గురించి, అవే భావాలని, ఆలోచనలని, కొత్త కవితలలో వివిధ సంఘటనల నేపధ్యం తీసుకొని రాయటమేనా లేక ఆ పూర్వులను, వారి త్యాగాలను గుర్తించి గౌరవాదరాభిమానాలతో నిండిన ప్రేమ పూర్వకమైన- ఒక్క మాట, ఒక్క వాక్యం రాస్తున్నారా?

-"మేము దళితులం, మేము దళితులం....బాధలు, అవమానాలు పడ్డాం" అని పాడిన పాటే పాడటం వల్ల అస్పృశ్యత పోతుందా? వర్గాల మధ్య దూరాలు పెరుగుతాయా లేక తగ్గుతాయా? వర్గ బేధాలు సమసిపోయి సామాజిక ఐక్యత సిద్ధిస్తుందా?

-దేశ శ్రేయస్సు, సమాజ హితం ఎందులో వుంది - హక్కుల కోసం, పదవుల కోసం పోరాడటం లో వుందా? లేక సరియైన భావాలని అందరిలో వ్యాప్తి చేసి అందరినీ ఎకోన్ముఖం చెయ్యటం లో వుందా?

చెడు పోవాలంటే మంచిని పెంచాలా లెక చెడో చెడో అని అరవాలా?.

వూరికే నినాదాలు చేయ్యటం అనేది ఇంకా ఇంకా కుల, వర్గ బేధాలను పెంచే పొలిటికల్ స్టంటే తప్ప జాతీయ ఐక్యతకు, దేశాభివృద్ధికి ఎందుకూ పనికిరాదు.

Wednesday, April 4, 2007

మీకేంటండీ...సాఫ్టువేరు...!!

"ఓ మీరా!! రండి..రండి..ఆ..! బావున్నారా?.. కూర్చోండి..రా బాబూ కూర్చో"

"బావున్నామండీ..మీరు బాగున్నారా?"

"ఆ బావున్నాం.. ఇతనెవరూ?"
...
"మా వాడే...కంప్యూటరు"
...
"మా అక్క కొడుకు...సాఫ్టువేరు"
...
"మా అన్నయ్యగారి అబ్బాయి..హైటెక్ సిటీ లో సాఫ్టువేరు ఉద్యోగం"
...
లేక పోతే "....కంప్యూటరు మీద పని చేస్తున్నాడు..హైదరాబాదులో"

ఇవీ నాకు దొరికే ఇంట్రడక్షన్లు ...

ఇక నెక్స్ట్ ప్రశ్న..

"సాఫ్టువేరంటే బానే ఇస్తారుగా...ఎంతిస్తారో.."
....
"ఎంతొస్తయి బాబూ"
...
"ముప్ఫయి వేలండీ.."
.....
"అబ్బా!! అంతిస్తారా? అసలు మీరు ఏం చేస్తారు? కంప్యూటర్లు తయారు చేస్తారా?"
....
"అన్ని డబ్బులు ఎంజేస్తారు?"
...
"ఇద్దరూ కంప్యూటరు ఉద్యోగాలేగా!! ఇంక మొత్తం సేవింగ్సే అన్న మాట!!"
...
ఎదవ దొబ్బుడు..
....
ఇక రియల్ ఎస్టేట్ వాళ్ళు - "అబ్బా!! అంత రేటా?" అంటే "మీకేంటి సార్ సాఫ్టువేర్ జాబు"
....
ఆటో వాళ్ళు అల్టిమేట్

కొత్తగూడా క్రాస్ రోడ్ నుంచి విప్రో కి 10 రూపాయలు. అదే దూరం ఉప్పల్ రోడ్ లో అయితే 4 రూపాయలు.

అదేమంటే మళ్ళీ స్టార్టు.."మీకేంటండి..." "మీరే ఇవ్వక పొతే ఎట్లా?"
మాములు ఉద్యోగం చేసే వాళ్ళు ఎక్కితే వాళ్ళనీ పీడిస్తారు "అదిగో వాళ్ళు ఇస్తున్నారు..మీరు ఇవ్వండి" అని.

విప్రో నుంచి కాన్‌బే కి 3 రూ. కాని కొత్తగూడా క్రాస్ రోడ్ నుంచి కాన్‌బే కి 15.

కూకట్‌పల్లి నుంచి హైటెక్ సిటీ కి 10 రూ. అది 10KM డిస్టెన్శ్.
హైటెక్ సిటీ నుంచి 1 KM దూరంలో వున్న వానెన్‌బర్గు కి 5 రూ.

అడిగితే "మీరు కూడా ఇవ్వక పొతే ఎట్లా?" అంటారు..

మా ఆవిడ కి చివరికి విరక్తి వచ్చింది. అందుకే ఇక డిసైడ్ అయ్యింది- ఇక ముందు నుంచి ఎవరన్నా అడిగితే "మార్కెటింగ్", "ఫాకల్టీ", ఇట్లాంటివి చెప్పాలని.
.........
అదేమి విచిత్రమో కానీ ఐటి సందట్లో అసలు లాభ పడుతున్న రియల్ ఎస్టేట్ వాళ్ళ గురించి ఎవరూ మాట్లడరు. అందరి నోళ్ళలో పడేది నా లాంటి ఐటి బకరాలే.
......
అసలు ట్రాజెడీ ఏమిటంటే నేనూ, చాలా మంది నా ఐటి ఫ్రెండ్సూ నెలాఖరుకి "ఎవడు అప్పు ఇస్తాడా?" అని చూస్తూ వుంటాము.
మేము సంపాదిస్తున్నవి "క్రెడిట్ కార్డు బిల్లులు, నిల్లు బాంకు బాలెన్సులు".

Monday, April 2, 2007

హైదరాబాద్ లో ఐ.ఎస్.ఐ ఏజెంటు అరెస్టు. - మానవ బాంబు బృంద ప్రవేశం.

ఇస్లామిక్ తీవ్రవాదులు - సెక్యులర్ భాషలో చెప్పాలంటే ఐ.ఎస్.ఐ ఏజెంట్లు - ఢిల్లీ నుంచి గల్లీ దాక పాకిపోయారు. వాళ్ళకి ఇవ్వ బడుతున్న ట్రైనింగ్ ఒకటే - "కాఫిర్" లను చంపాలి; అట్లా చంపితే స్వర్గం లో స్పెషల్ బెర్తు గ్యారంటీ. - అలా ఆ నెట్‌వర్క్ విస్తరిస్తుంటే మనమేమో అదెమీ తెలియనట్టు క్రికెట్ మునిగి తెలుతాం, క్రికెటర్ల దిష్టి బొమ్మలు కాల్చుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతాం.

ఇక్కడ నాకొక డౌటు. తీవ్రవాదుల దృష్టిలో హిందువులు ఎంత కాఫిర్లో, క్రిష్టియన్లూ అంతే కాఫిర్లు కదా. విగ్రహారధకులని చంపాలి అన్న సిద్దాంతం పట్ల వాళ్ళకి అంత నిబద్దతే వుంటే మరి చర్చిల మీద ఎందుకు దాడులు జరగట్లేదు. అపార్థం చేసుకోకండి - నా వుద్దేశం వాటి మీద కూడా జరగాలి అని కాదు. హిందువుల మీద హిందూ, దేవాలయాల మీదే ఎందుకు జరుగుతున్నాయి? అని.
వాళ్ళకు ఏమన్నా ప్రత్యేకమైన అదేశాలు వున్నాయా ఈ రెండో వర్గం జోలికి వెళ్ళద్దని? వుంటే, ఎవరు ఇచ్చి వుంటారు? అదేశాలు ఎలా వుండి వుంటాయి. నా గెస్‌లు...
1) "మీరు ఎమన్నా చేసుకోండి. కానీ "మా వాళ్ళ" జోలికి వెళ్ళకండి"
2) "అక్కడ (ఇండియా లో) మీ వాళ్ళని ఎమన్నా చేయ్యనివ్వండి. కానీ "మా వాళ్ళ" జోలికి వెళ్ళకుండా చూసుకోండి"
3) "మేము చెప్పినట్టు గా అక్కడకి తీవ్రవాదుల్ని పంపండి. కానీ మా వాళ్ళకి ఏమీ కాకూడదు"
4) లేక పొతే మన అంతఃశ్శత్రువులే ఎమన్నా లోపాయకారీ ఒప్పందం చేసుకున్నారా?

మన దేశం లో వున్న టెర్రరిస్టుల వెనుక పాకిస్తాన్ ఒక్కటే వుందంటే నాకు నమ్మ బుద్ది కావట్లేదు.
వాళ్ళు ఎన్నన్నా చెయ్యనీ, మన సిగ్గులేని ప్రభుత్వం పాకిస్తాన్ తో "కలిసి" ఉగ్రవాదం పై పోరాడుతుందట. ఈ డైలాగ్ కూడ ఎవరు చెప్పించారో మన వాళ్ళతో?
వోట్లు అడగటానికి వాళ్ళకి సిగ్గు లేదు. అడిగినప్పుడల్లా వెయ్యటానికి నా లాంటి జనానికి బుద్ది లేదు.

అవునూ ఇంతకీ వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారంటారూ? మీ ఒపీనియన్ ఎమిటో?


Free Blogger Templates by Isnaini Dot Com and Flowers and Decors. Powered by Blogger