Saturday, March 31, 2007

భారత్ - అమెరికా అణు ఒప్పందం.

అమెరికా ప్రభుత్వం తయారు చేసిన "హైడ్" చట్టానికి లోబడిన ఈ అణు ఒప్పందం వల్ల మన డేశానికి ఎంతో నష్టం జరుగనున్నా దీనిని మన శాస్త్రవేత్తలతోనూ, పార్లమెంటు తోనూ ఒప్పించే ప్రయత్నాలు పకడ్బందీగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఒకసారి ఒప్పందం జరిగాక ఇక మన దేశం శాశ్వతంగా శాస్త్ర రంగం లో స్వయం ప్రతిపత్తి ని కోల్పోతుంది. భవిష్యత్తులో మనం మళ్ళీ అణు కార్యక్రమాలను చేపట్టే ప్రయత్నం చేస్తే ఇవ్వళ ఇరాక్ కి పట్టిన గతే మనకూ తప్పదు. భారత్ మీద ఎంతో అభిమానం చూపుతున్నట్లున్న అమెరికా ధోరణి ఎంత నిజమో స్వర్గాన వున్న సద్దాం ని అడిగితే చెప్తాడు. ఆయన్ని అధ్యక్ష పీఠం మీద కూర్చో పెట్టిందీ అమెరికానే; చివరికి ఉరి తీసిందీ అమెరికానే.

శాస్త్రవేత్తలు వద్దంటున్నా మన్‌మోహన్ సర్కారు దీని మీద సంతకానికి అంత అత్యుత్సాహం ఎందుకు చూపిస్తున్నట్టు? అమెరికా నిజమైన వైఖరి ఏమిటి?

2 comments:

Sudhakar said...

ఎందుకు ఉత్సాహం చూపుతున్నారంటే "పోయేకాలం" వలన. భారత్ ప్రపంచ ఆర్ధిక రంగంలో నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నదంది వాస్తవం. దానిని ఆపటం ఎలాగూ కష్టం. కాబట్టి ఇలాంటి కుయుక్తులు అవసరం కదా..భవిష్యత్తులో మన తరాలు ఇప్పటి నాయకుల చెత్త నిర్ణయాలను ఖచ్చితంగా తిట్టుకుంటారు.


మీ బ్లాగు మంచి పోష్టులతో మొదలు పెట్టారు :-) ఇక వివాహ బోజనమే :-)

రవి వైజాసత్య said...

భారతీయ దౌత్యవేత్తలు అంత వాజెమ్మలు కాదు. స్ట్రోబ్ టాల్బట్ (భారత్ అణుపరీక్షలు జరిపిన తర్వాత జస్వంత్ సింగ్ తో తెరచాటు దౌత్యం నడిపింది ఈయనే) రాసిన ఎంగేజింగ్ ఇండియా చదివే వరకు నేనూ ఇలానే అనుకునే వాన్ని. స్వయం ప్రతిపత్తి ఉండాలి కానీ గిరిగీసుకొని కూచ్చోవటం పాత చింతకాయ పచ్చడి ఆలోచనా ధోరణి. Interdependence is a choice of higher level only independent people can make - Stephen R Covey


Free Blogger Templates by Isnaini Dot Com and Flowers and Decors. Powered by Blogger