Monday, August 6, 2007

కొత్త తెలుగు పదాలు సృష్టించటం

>Naveen's post in telugublog group
>On Aug 3, 9:39 pm, నవీన్ గార్ల wrote:
> hardware = కఠినాంత్రము
> software = కోమలాంత్రము
నా దృష్టి లో పదాలను సృష్టించటానికి అనువాదపద్దతి కంటే పూర్తిగా కొత్త శబ్దాలని కనిపెట్టటానికి ప్రయత్నించడం మేలు.
(*) Pronounciation & Ease of use
ఇంగ్లీషు భాష పదకోశం అంతా మనంత నిర్దుష్టంగా పలకాల్సిన అవసరం లేని పదాలతో ఉంటుంది.
వాళ్ళ pronounciation కూడా అంతే ఉంటుంది. ex: "హిందూ ధర్మ" అనమంటే "HhinDoo Daarma" అనటం చూసా TV లో. అనువదించిన పదాలు ఇంగ్లీషు వాటంత సులువుగా ఉండవు. మనం పెద్ద పెద్ద క్లిష్ట పదాల పట్టిక తయారు చేసి తెలుగు ని unusable గా చేసే ప్రమాదం ఉంది.

(*)Glamour
ఒక పదాన్ని అనువదించటం వల్ల ప్రజలు ఆ తెలుగు పదాన్ని దాని తాలూకు ఇంగ్లీషు పదంతో పోల్చటం మొదలు పెడతారు. పై ఉదాహరణ నే తీసుకుంటే "కోమలాంత్రము" కంటే " software" ఈజీ గా ముఖ్యంగా "స్టైలిష్" గా ఉందని భావిస్తారు. తెలుగు పదం "glamour less" గా కనిపిస్తుంది. దాని వల్ల నలుగురి లో ఉన్నప్పుడు ఆ తెలుగు పదాన్ని పదాన్ని వాడితే నవ్వుతారేమో అని జంకే అవకాశం ఉంది.

(*) అనువదించటం వల్ల అవి మన సొంత పదాలు కాదని చెప్పకనే చెప్పనట్టవుతుంది.

సులభంగా ఉండే కొత్త శబ్దాలు కనిపెడితే అవన్నీ మన పదాలు అని గర్వంగా చెప్పుకోవచ్చు వాడకం కూడా పెరుగుతుంది. కానీ బాగా ప్రచారం అవసరం.
ex: operating system - (translation) నిర్వాహక వ్యనస్ధ - (different word): హలోక.
Byte - - దిమిని.

"ఎలా వచ్చింది"? అంటే... "అదంతే!" అని సమాధానం.

కాకపోతే తెలుగు పండితులు ఈ పద్దతిని "systematize" చెయ్యచ్చు so that every other person will not start coining his own words.

Thursday, August 2, 2007

విచిత్ర తెలుగు

మొన్న టి.వి లో హగ్గీస్ ప్రకటన చూశా. కాప్షన్ "..తడితనం..తో పోరాటం".. అట. ఇదెక్కడి తెలుగో.."చిన్నతనం","ముసలితనం" ఇవి విన్నాం... తడితనం మాత్రం నాకు కొత్తే... "గీలాపన్" కి అనువాదం అనుకుంటా..యాడ్ ఏజెన్సీ రైటర్స్ ని అర్జంటుగా బాగు చేయాలి.

Tuesday, July 24, 2007

హైదరాబాదు "బ్యూటిఫికేషన్" - రోడ్డు డివైడర్ల ప్రహసనం

నేను హైదరాబాదు లో సెటిల్ అయినప్పటి నుంచి చూస్తున్నాను మన హుడా వారి మాయ.

ఫస్ట్ ఏమీ లేని రోడ్డు మీద 6 అంగుళాల ఎత్తున్న డివైడర్ వేస్తారు.
తరువాత సీజన్ లో వాన పడగానే 6 అంగుళాల మందం రోడ్డు మళ్ళీ వేస్తారు. ఇప్పుడు డివైడర్ రోడ్డులో కలసి పోయిందని 12 అంగుళాల ఎత్తున్న డివైడర్ వేస్తారు.

నెక్స్ట్ సీజన్ : రోడ్డు మరో 6 అంగుళాల మందం పెంపు. డివైడర్ కూడా ఒకటిన్నర అడుగుల ఎత్తు అడుగు వెడల్పుతో ఒళ్ళు చేయటం మొదలెడుతుంది.

పై సీజన్ : మళ్ళీ తారు పూత. ఇప్పుడు డివైడర్ సైజు 2 అడుగులు ఎత్తు , 2 అడుగులు వెడల్పు. ఇక మోకాలి నొప్పుల ముసలి వాళ్ళు అది దాటలేరన్నమాట.

ఆ పై సీజన్ :రోడ్డు మరో 6 అంగుళాలు. డివైడర్: 2 1/2 అడుగులు ఎత్తు , 3 అడుగులు వెడల్పు, మధ్యలో మట్టి-అందులో మెక్కలు. ఈ పాటికి అది క్రికెట్ పిచ్ లాగా కనిపిస్తుంటుంది.

ఏడాదిన్నర తరువాత: ట్రాఫిక్ కి రోడ్డు చాలట్లేదని డివైడర్ మొత్తం తీసేసి రోడ్డు వేసేస్తారు.

ప్రతి రోడ్డుదీ ఇదే పరిస్థితి. బ్యూటిఫికేషన్ పేరుతో జరుగుతున్న ఈ దోపిడీ ని మనం ప్రశ్నించలేమా? అరికట్టటం ఎలా?

విఫలమైన ఐక్యతా ఉద్యమాలు

Saturday, June 23, 2007

తెలుగు ప్రతిభ.ఆర్గ్

"నేనూ మార్గదర్శ లో చేరాను. ఒక డొమైన్ పెట్టుకున్నాను. పేరు తెలుగుప్రతిభ.ఆర్గ్. ప్రస్తుతానికి నా ట్రేడ్ మార్కు పలక మాత్రమే ఉన్నది అందులో. నెమ్మదిగా నాబ్లాగు, ఆ తరువాత నా టెక్నికల్ రాతలు చేరవేస్తాను.

Monday, June 18, 2007

తీవ్రవాద బాధితుల దినం

అమెరికాలో 9/11 సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రతి ఏటా శ్రద్ధాంజలి ఘటిస్తారు. యావద్దేశము ఒకసారి వారిని గుర్తు చేసుకొంటుంది. అదంతా టివి లలో వస్తుంది. అది అమెరికా వాళ్ళకే కాక భారతదేశానికి, ప్రపంచం మొత్తానికి వార్తే. కానీ మన దేశంలో మాత్రం పంజాబ్ లోను, కాశ్మీర్ లోను, ఆంధ్రలో నక్సలైట్ల చేతుల్లోను ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక సబర్మతి ఎక్స్ ప్రెస్, రఘునాథ మందిరం, అక్షరథామ్ వంటి వాటికి లెక్కే లేదు. మన ప్రభుత్వం వారిని గుర్తు కూడా చేసుకోదు. మనమన్నా వాలంటైన్స్ డే, ఫాదర్స్ డే , మదర్స్ డే, ఉమెన్స్ డే వీటితో పాటు ఒక "తీవ్రవాద బాధితుల దినం" ఒకటి మొదలు పెట్టి వారికి మన సానుభూతిని తెలియ జేద్దాం. ఇలా చేయటం సమాజం మీద ఎంతో ప్రభావం కలుగిస్తుందని నా నమ్మకం. To feel it "really" demands sincerity, patriotism, a sovereign feeling, a feeling of oneness from a person.

ఏమంటారు? అసలు ఇట్లాంటిది ఒకటి ఆల్రెడీ ఉన్నదా?

పాకిస్తాన్ నుంచి భారీ సంఖ్యలో చొరబాట్లు..2 దశాబ్దాలలో రెట్టింపైన కాశ్మీర్ జనాభా

తీవ్రవాదం తో అట్టుడుకుతున్న కాశ్మీర్ జనాభా గత 25 సం లలో దాదాపు రెట్టింపైంది.
ఒక పక్క ఐదు లక్షల మంది కాశ్మీరీ పండిట్లు, ఇంకా ఇతర హిందువులు అక్కడి నుంచి వలస పోవటం, 30000 వేల మందికి పైగా తీవ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోవటం జరిగానా కూడా జనాభా ఇంత ఎత్తున పెరగటం గమనార్హం. ఈ జనాభా పెరుగుదలకి చాలా కారణాలున్నా మత ఛాందసవాదం పాత్ర చాలా ఉంది.

80 వ దశకం లో భారత ప్రభుత్వం జనాభా పెరుగుదల అదుపుకై దేశ వ్యాప్తంగా సంక్షేమ పథకాలు- కు.ని ఆపరేషన్లు చేయించుకున్న వారికి ఇంక్రిమెంట్లు వంటివి- చేపట్టింది. కాశ్మీర్ లో చాలా మంది ముల్లాలు వీటిని బాహాటంగా వ్యతిరేకించి, అక్కడితో ఆగకుండా ఎక్కువ మంది పిల్లలని కన్నవారికి నగదు బహుమతులు ప్రకటించారు. కొంత మంది అటు మొగ్గారు. కొంతమంది ఇటు.
చాలా మంది ప్రభుత్వోద్యోగులు ఈ పథకాల వల్ల లబ్ధి పొందాక కూడా పిల్లల్ని కని, ఆపరేషన్ సరిగ్గా చేయలేదని వైద్యుల పై తప్పు నెట్టారు.

1989 లో తీవ్రవాదం మొదలుతో కొత్త పోకడలు వచ్చాయి. ఇలాంటి పథకాలు అమలు చేసే ఉద్యోగులకు, వైద్యులకు బెదిరింపులు, బలవంతపు వివాహాలు, బలాత్కారాలు, చొరబాట్లు మొదలయ్యాయి.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని ఆనుకొని ఉన్న బారాముల్లా, కుప్వారా జిల్లాలలో 1981-2001 మధ్య అధిక జనాభా పెరుగుదల నమోదు
అయింది- కుప్వారా 94%, బారాముల్లా 83%. హిందువులు ఎక్కువగా ఉన్న కథువా జిల్లాలో అత్యల్పంగా 46% నమోదయ్యింది. 1991 లో తీవ్రవాదం కారణంగా జనాభా లెక్కలు జరుగలేదు.

ఈ విపరీత పరిణామం అక్కడి ప్రభుత్వ సంక్షేమ పథకాలని కుంటు పరచటమే కాక, అక్కడి పాలకుల అస్థిత్వాన్నే ప్రశ్నిస్తోంది.

Wednesday, June 13, 2007

RTS , Inscript - ఏది బెస్టు?

నిన్న చరసాల ప్రసాదు గారు, కొత్త పాళీ గారు నా పలక గురించి తెలుగుబ్లాగు లో రాసిన వ్యాఖ్యలు చూసాక దీని గురించి రాద్దామనిపించింది.

"ఏది బెస్టు?".. అంటే..ఏదీ కాదు... "మనకు" ఏది బెస్టో చెప్పచ్చు...మన టైపింగ్ శైలి బట్టి, అలవాటు బట్టి.
టైపు రకరకాలుగా చేస్తారు.
1)ప్రోగ్రామింగ్ లో కి వచ్చాక టైపు మొదలు పెట్టిన మా స్నేహితులు ఉన్నారు. మొదట్లో టెక్నాలజీ తొందరగా నేర్చుకోవటం ముఖ్యం కాబట్టి కీ బోర్డు చూసి టైపు చెయ్యటం స్టార్ట్ చేస్తారు. రెండు వేళ్ళతో చేస్తున్నామా లేక 10 వేళ్ళతో చేస్తున్నామా అని పట్టించుకోరు. ఇక అలాగే అలవాటు అవుతుంది. ఇదేదో తప్పు అని కాదు- అలవాటు గురించి చెప్తున్నా.

2)నాకు మా లెక్చరర్, టైపు నేర్చుకోమని చెప్పారు డిగ్రీలో ఉండగా..అలా నాకు కీ బోర్డు చూడకుండా 10 వేళ్ళతో చేయటం అలవాటు అయింది.
3)ఈ రెంటికీ మధ్య లో చాలా మంది ఉంటారు. ఒక 4-5 వేళ్ళు వాడుతూ, మధ్యమధ్యలో కీ-బోర్డు చూస్తూ చేస్తారు.

మీరు పై వాటిల్లో 1 వర్గానికి చెందితే RTS ఈజీగా అనిపిస్తుంది.
నాకు inscript ఈజీ. ఎందుకంటే నేను వేళ్ళకి అక్షరాలని అలవాటు చేస్తాను కాబట్టి. నాకు అది mechanical process.
RTS నాకు inconvenient. నాకు "RTS" వల్ల "case sensitive consciousness" ఎక్కువ అవుతుంది. పేర్లు టైపు చేసేటప్పుడు "భారతి" అని టైపు చెయ్యవలసి వస్తే నేను "BArati" అని చెయ్యబోతాను. మళ్ళీ సరిచేయాలి. అలాగే తెలుగులో బాగా కలసి పోయిన పదాలు.
ఎలక్షన్ :- "election" -english , "elakshan" - RTS.
డైరీ :- "diary" - english, "DairI" - RTS
ఇంకా స్పెల్లింగ్ మనసులో అనుకుంటూ టైపు చేస్తా కాబట్టి వేగం మందగిస్తుంది.
ఈ రెండు కారణాల వల్ల నేను inscript కి మారాను.

అయితే 2 వ వర్గానికి చెందిన వాళ్ళలో చాలా మంది RTS బాగా అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు.
కానీ టైపు వచ్చిన వాళ్ళు, కొత్తగా తెలుగు వాడటం మొదలు పెడితే inscript అలవాటు చేసుకోవటం ఉత్తమమని నా అభిప్రాయం.

మీరు 3 వ వర్గానికి చెందితే మీరు కూడా inscript అలవాటు చేసుకోవటం మంచిదని నా భావన.

రెండూ చూసి మీకేది మంచిదో నిర్ణయించుకోండి.
పలక

Sunday, June 3, 2007

శివానందలహరి










Wednesday, May 30, 2007

Hindu extremists' hand in Makkah Masjid blast - Urdu dailies

www.indianmuslims.info

In his article "Makkah Masjid: Who is Responsible for the Blast?" in Akhbar-e-Mashriq, Dr. Nasr Firdausi, though he agrees to part of the police version that the blast was "organised," has expressed utter surprise on how the police and state machinery was quick to name Harkatul Jihad and Simi as responsible for the blast. "Their approach is crooked, hearts biased and the statement full of hatred towards Muslims," he writes.

Citing various terror incidents at places like Akshardham Temple, Varanasi Temple, Mumbai railway station, Jama Masjid Delhi, Makkah Masjid Hyderabad, he wonders why senior IPS officers do not find the hand of Rashtriya Swayam Sevak Sangh, Vishwa Hindu Parishad, Bajrang Dal or Shiv Sena in such terror incidents despite solid proofs. He goes on to say, "Police officers today are sons of Sangh Parivar. How will they say anything about their Parivar?"

He suggests to the government to suspend such police officers who are quick to make statements without any investigation, and enquire about them where they had been educated, where they had been living for the last few years, who are their relations and where their spouses have come from.

In his column Fikr-e-Farda in Hindustan Express Ahmad Javed has discussed Makkah Masjid blast's link with Gujarat rather than Pakistan, Bangladesh or Saudi Arabia.

In another article in the Express, All India Milli Council general secretary Dr. Manzoor Alam has referred to the findings of Hindu extremists' hand in Nanded and other blast incidents in Maharashtra, and laments that no one refers to these findings while discussing identical incidents. "No statement is made to the effect that in this case Hindu extremist organisations might be involved," he writes.

Dr. Alam then asks, "Have President of the Republic, UPA chairperson and Prime Minister - all have been taken hostage by some vested interests? Have they no power to act on their own will?"

The Milli Council leader came heavily down upon the impotency of the government authorities to nail these terrorists: "It seems the government machinery has been taught Muslim enmity as a matter of government policy. The police and bureaucracy of any State are no exception to this Muslim-enmity policy. And the centre is after all centre. It is as if killing and harassing Muslims has become a question of "national interest". If this is the national interest, what interest the oppressed lot of the country will have in this national interest? The interest of self-seekers, fascists and enemies of humanity has come to be said as national interest but it can never be national interest in the real sense of the term."

(Muslims are systematically propagating against Hindu Organizations. Every Hindu organization should be vigilant about such disinformation. -Editor)

ww.hindujagruti.org

-----------------------

వినే వాడుంటే చెప్పే వాడు ఏదైనా చెప్తాడంటే ఇదేనేమో?

తమని తాము ఒక మతం తో identify చేసుకోవటం, మీ మతం తప్పు మా మతం రైటు అనటము; ఇతర మతాలని ద్వేషించటం, ప్రపంచమంతా బాంబులు పెట్టటం, లాస్ట్ కి వచ్చి అందరూ మనలని శతృవులుగా చూస్తున్నారు. చంపాలని చూస్తున్నారు అనటం ఇస్లామిక్ టెర్రరిస్టులకే చెల్లింది. మిగతా వాళ్ళకేమీ పని లేదా వీళ్ళని చంపటం తప్ప?

Sunday, May 13, 2007

ప్రసిద్ద్హ తెలుగు పద్యాలు

శ్రీ P.రాజేశ్వరరావు గారి సంకలనం లో "ప్రసిద్ద్హ తెలుగు పద్యాలు " అనే పుస్తకం ఇప్పటికి 4 ముద్రణలు పూర్తి చేసుకుంది.
పుస్తకం ముందు మాటలో ఇలా వుంది "మన తెలుగు సాహిత్యం లో ప్రసిద్ధమైన పద్యాలు ఎన్నో వున్నాయి. వాటిల్లో పద్యపరంగానూ, భావరీత్యంగానూ - ప్రసిద్ధమైన వాటిని, ప్రశస్త్యమైన వాటిని భారతం, భాగవతం, పారిజాతాపహరణం, కళాపూర్ణోదయం, విజయ విలాసం, సుమతీ శతకం, నరసింహ శతకం, దాశరథీ శతకం మొదలగు గ్రంధాల నుండీ శ్రీనాధుడు, శ్రీకృష్ణదేవరాయలు, అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణుడు, ధూర్జటి, వేమన, చిలకమర్తి లక్ష్మీనరసింహం, తిరుపతి వెంకటకవులు, జంధ్యాల పాపయ్య శాస్త్రి, నార్ల చిరంజీవి, నార్ల వెంకటెశ్వర రావు గార్ల ప్రచురణల నుండీ 250 కి పైగా పద్యాలను సేకరించి, భావంతో ఈ చిరు పుస్తకాన్ని అందిస్తున్నాను" .

మంచి పుస్తకం. తప్పక కొనండి. చదవండి.

ప్రచురణ: "ప్రతిభ పబ్లికేషన్స్, ఫ్లాట్ నెం.2, శ్రీ శంకర్ కాలనీ, ఎల్.బి. నగర్, హైదరాబాద్ - 500 074 "
ప్రతులకు - విశాలాంధ్ర. వెల రూ. 30 /-

ఆ పుస్తకంలో నేను చదివిన కొన్ని ఇక్కడ వేస్తాను.
విజయ విలాసము - చేమకూర వేంకట కవి (17 శతా) - సుభద్ర యౌవన ప్రాదుర్భావము.

అతివ కుచంబులున్ మెఱగుటారును వెనలియున్ ధరాధిపో
న్నతియు నహీనభూతికలనంబు ఘనాభ్యుదయంబు నిప్పుడొం
దితిమీని మాటిమాటికిని నిక్కెడు నేల్గెడు విఱ్ఱవీగెడున్
క్షితి నటుగాదె యొక్కసరికి న్నడుమంత్రపు గల్మి కల్గినన్.


సుభద్ర పుట్టినప్పుడు లేని శోభ ఈ ఎలప్రాయంలో కలిగినందుకు స్తనాలు, నూగారు, కొప్పు విర్రవీగుతున్నాయట. లోకంలో కొందరు నడమంత్రపు సిరి గలిగినప్పుడు ఇలాగే అహంభావం ప్రదర్శిస్తుంటారు. స్తనాలు, నూగారు, కొప్పు ఇవన్నీ స్త్రీలకు మధ్యలో వచ్చేవే కదా.


note: ఇది కవిత్వం కాదు రసికత్వపు కంపు అనుకొనే వాళ్ళు దీన్ని మర్చిపోవచ్చు.
నాకొక డౌటు. ఇట్లాంటి కవిత్వాన్ని తిట్టే వాళ్ళు, (తిట్టే వాళ్ళు మాత్రమే, నేను "అందరూ" అనట్లేదు )తమ నిజజీవితం లో ప్రేమలో పడ్డప్పుడు, పెళ్ళయ్యిన కొత్తలో వారి భార్యలకు ప్రేమ పాఠాలు చెప్తారో లేక ఆర్థిక, సామాజిక అసమానతలు, కులవివక్షతల వర్ణనల కవిత్వం చెప్తారో మరి!. I am not saying such literature is not needed. Everything has its own place. There is a time for each emotion and correspondingly for each type of poetry. One should not detest a particular type just because it does not talk about their group or because of religious prejudices.

మున్నా - అదో గుండు సున్నా

ఈ సినిమా కి అన్నీ ఉన్నాయి...లాజిక్ తప్ప...

పాటల పిక్చరైజేషన్ బావుంది 90% మార్కులు. పాటలు కూడా ఓ.కే 70% మార్కులు. హీరో డాన్స్ - సూపర్ కాక పోయినా 70% మార్కులు ఇవ్వచ్చు. ఫైట్లు 90% మార్కులు. హీరో ఇంట్రడక్షను, ఫస్టు హాఫ్ బాగానే వుంది.

కథ "ప్లాట్" కూడా బావుంది - హీరో ఒక అనాథ. విలన్ ఒక మిలియనీరు. హీరోకి విలన్ అంటే బాగా ద్వేషం. ఎందుకూ? అంటె "వాళ్ళిద్దరూ తండ్రీ కొడుకులు; ఆ తండ్రి హీరో చిన్నప్పుడు తల్లిని వ్యభిచార గృహానికి అమ్మితే ఆమె పైనుంచి దూకి చచ్చిపోయింది" అన్న ట్విస్టు ఇంటర్వెల్ లో ఇస్తాడు. విలన్ కి హీరో కాక ఆత్మ అనే ఇంకో శతృవు వుంటాడు. క్లైమాక్సులో ఆత్మాని విలనే సృష్టిస్తాడు అనేది ట్విస్టు. బానే వుంది.

కాని కధ నడిపిన తీరు , కథ ముగించిన తీరు తుస్సుమన్నాయి.
ఒక ఇంజనీరింగ్ చదివే కుర్రాడు వేసే ఎత్తుకి ఫార్మస్యూటికల్ ఫ్యాక్టరీ మూత పడుతుంది. పోనీ అదేమన్నా భయంకరమైన అయిడియానా అంటే అదీ కాదు. విలన్ గారి పిల్లల పెళ్ళి సీను లాజిక్ కి దొరకదు. ఆంధ్రుడు సినిమా క్లైమాక్సు ఫైటంత illogicalగా వుంది. ఫైట్లు లాజిక్కి దొరక్కపోయినా పర్లేదు. కనీసం కథ అన్నా దొరకాలి కదా. బిడ్డ చావుకి కూడా ఏడవని ఖాఖా ఆత్మహత్యకి పాల్పడటానికి ఇచ్చిన రీసన్ నాకర్థం కాలేదు.

వేరే ఏ సినిమా లేక పొతే దీనికి వెళ్ళండి.
ఇలియానాని చూసిన మేరకు టికెట్ డబ్బులు దక్కుతాయి.

Wednesday, May 9, 2007

పేపర్ వేస్టు, ఇ-వేస్టు : కాలుష్యము , గ్లోబల్ వార్మింగ్

వారం లో రెండు మూడు సార్లు నేను ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు పార్కింగ్ ప్లేస్ లో మెయిల్ బాక్స్ చూస్తాను ఏమన్నా కావాల్సిన ఉత్తరాలు వున్నాయేమో అని. టెలిఫోను బిల్లు కవర్లు, క్రెడిట్ కార్డ్ ఇన్‌వాయిస్ లు వుంటాయి. బిల్లుల్లో దాని తాలుకు వివరాలు మాత్రమే వుండవు. నాకు బిల్లు కట్టటం సులభం చెయ్యటం కోసం వాడు ఒక రిటర్న్ పోస్టు కవరు ఇస్తాడు నేను బిల్లు పేమెంట్ చెక్ పంపటానికి. ఇది కాక రెందు టావుల నిండా కొత్త ఆఫర్ల వివరాలు, ఛారిటీ కి డొనేట్ చెయ్యమంటూ అడిగే ప్రకటనలు ఉంటాయి. మామూలు ఉత్తరాలతో పాటు రియల్ ఎస్టేట్ ఆడ్‌లు, పిజ్జా హట్ ఆఫర్ పాంప్లిట్లు, ఫర్నిచర్ షాపు డిస్కౌంట్ ఆఫర్ యాడ్ లతో బాక్సు నిండి పోయి వుంటుంది.

ఇవన్నీ చూస్తే ఎంత పేపరు వృధానో అనిపిస్తుంది. ఇట్లా ఊరినిండా రోజు ఎన్ని వేల పాంప్లిట్లు వస్తున్నాయో వాటి వల్ల రోజూ ఎన్ని టన్నుల కాగితం వృధా అవుతుందో, ఆ కాగితాన్ని తయారు చెయ్యటం లో ఎంత పొల్యూషన్ పెరిగి వుంటుందో ఇంకా ఇట్లా ఎనెన్ని నగరాల్లో ఎంత కాగితం వేస్ట్ అవుతుందో తలుచుకుంటే నాకు చాలా బాధేస్తోంది. పేపర్ లెస్ సమాజం వస్తే ఎలా వుంటుందో?

కాని కంప్యూటరైజేషన్ వల్ల కూడా కాలుష్యం తక్కువేమీ లేదు. నిన్న టివి లో చూపించాడు- యుఎస్, యూరోప్ ల నుండి ఇ-వేస్ట్ (మానిటర్లు, మదర్ బోర్డులు etc) అంతా బాంబే చుట్టూ పక్కల ఊళ్ళకి వస్తోంది. మన స్క్రాప్ వ్యాపారం చేసే వాళ్ళు దాన్నంతా కొని ఇక్కడకు తెచ్చి ఇక్కడ రీ సైక్లింగ్ అట. ఈ వ్యాపారులు ప్రమాదకరమైన, విషపూరితమైన పనికిరాని విడి భాగాలను ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోకుండా సముద్రం లో ను, తాగే నీటి వనరుల్లోను కలిపేస్తున్నారు. ఎమిటొ...? సర్లెండి..ఎక్కువ ఆలోచించి పెద్ద ప్రయోజనం లేదు.

Friday, April 20, 2007

Quote

He will, however, live forever on YouTube!! - sanjaya

Sunday, April 15, 2007

GIRISANTA

6. GIRISANTA

Among the 11 Rudras, the Rudra relating to speech is the most active one in the human being (remember that Rudra functions through the mind, the 5 sense organs and through the 5 physical organs of which speech is one). The Rudra that functions through the speech is called Girisanta. Girisanta means the one who bestows bliss through speech. Speech regulations are many (refer to the author’s book on “Sound”). Right speech which is harmonious builds harmonious energies in man. If not, speeches build conflict and its related worry, irritation, anger, etc. When speech is not harmonious, man transforms into a devil. When speech is harmonious, he can turn into a Deva. Horrible speeches would eventually lead one to horrible forms. Rudra, when worshiped, would arrest the tendency of abusive speech and would even liberate one to a state of harmonious speech and attractive form. With speech, one can destroy oneself or liberate oneself. One can throw oneself to hell or liberate oneself into heaven. Such is the power of speech. Such power is worshiped as Rudra.

Girisanta means the one who resides in speech. The use of speech is the use of Rudra’s power.


www.worldteachertrust.org

Saturday, April 14, 2007

డండడ డాండ డాండ

భండన భీముడార్త జన భాంధవుడుజ్వల బాణ తూణ కో
దండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామ మూర్తికిన్
రెండవ సాటి దైవమిక లేడనుచున్ కడ గట్టి భేరికా
డండడ డాండ డాండ నినదంబు లజాండము నిండ మత్త వే
దండము నెక్కి చాతెదను దాశరధీ కరుణా పయోనిధీ !!

Thursday, April 12, 2007

సంజయ మలకర్

చాలా భయంకరంగా తిట్టుకుంటునట్టున్నారు ఈ దేశీ బాయ్ ని అక్కడ.

చూ. Sick of Sanjaya? It's all Your fault

డిల్బర్ట్ బ్లాగ్ లో Most Useless Job in the Universe అనే పోస్టులో ఇచ్చిన ఒక ఉద్యోగం సంజయ మలకర్ కి "సంగీతం మేష్టారి" పని అట! :)

అమెరికా సోదరులెవరైనా కొంచం దీని గురించి పోస్టండి.

Tuesday, April 10, 2007

యండమూరి సినీ రంగ ప్రవేశం

ఇలా జరిగింది..

డాషర్

డాషర్ - చూడగానే నేను ఎంతో ఆశ్చర్యానికి లోనయిన inventions లో ఇదొకటి. అసలు టెక్స్ట్ ఎడిటర్లు ఇట్లాకూడా తయారు చెయ్యచ్చా అని పించింది. ఇందులో మామూలు టెక్స్ట్ ఎడిటర్ల లా తెల్ల స్క్రీన్ వుండదు; స్క్రీన్ కి ఒక మూల నుంచి అక్షరాలు వేగంగా వస్తూ వుంటాయి. కంటి కదలిక ద్వారా లెక, మౌస్ క్లిక్ ద్వారా, లేక ట్రాక్ బాల్ సహాయంతో మనం వ్రాయదలచుకున్న పదం లోని అక్షరాలని సెలెక్ట్ చేసుకోవాలి. అక్షరాలు స్క్రీన్ మీద ప్రత్యక్షం అయ్యే క్రమం మామూలు వర్ణ క్రమంలో ఉండదు. మనం ముందు సెలెక్ట్ చేసుకున్న అక్షరాలని బట్టి వాటికి దగ్గరగా వున్న పదాలలో వున్న అక్షరాలు వస్తాయి. ఉదా:- మనం ముందు h,e సెలెక్ట్ చేసామనుకోండి. తరువాత అది l చూపిస్తుంది. అది సెలెక్ట్ చేస్తే తరువాత l,o వరుసగా వస్తాయి. మన నోకియా లొ ఆటో వర్డ్ కంప్లీట్ లాగా అన్నమాట.

ఎక్కడైతే మామూలు కీ బోర్డ్ వాడటం కుదరదో అక్కడ ఇది విశేషంగా ఉపయోగ పడుతుంది. జాయ్ స్టిక్, ట్రాక్ బాల్, టచ్ సెన్సిటివ్ స్క్రీన్ లతో కంప్యూటర్ని ఉపయోగించాల్సిన సందర్భాలలో ఇది చాలా ఉపయోగం.

http://www.dasher.org.uk

Friday, April 6, 2007

దళిత తత్త్వం

దళితులుగా తమని భావించుకొనే వాళ్ళు -(అసలు ఈ పదం ఎట్లా పుట్టిందో దాని అర్ధం ఏమిటో నాకు తెలియదు)- చాలా మటుకు తాము ఎంతో కష్టాలు, అవమానాలు పడ్డాం అని అవేదన వ్యక్తం చేస్తుండటం మనం చూస్తున్నాం. ఇందులో భాగమే "దళిత కవిత్వం" అనబడే ట్రెండు. ఇవన్నీ చూస్తే ఎవరికన్నా ఏమని అనిపిస్తుందంటే భారత దేశం లో "అగ్ర" వర్ణాల వాళ్ళూ పచ్చి స్వార్ధపరులు, దయా దాక్షిణ్యాలు, మానవత్వం లేని వాళ్ళు అని.
ఎప్పుడూ కూడా అన్ని రకాల వాళ్ళూ సమాజం లో వుంటారు. కాకపోతే పర్సంటేజి లో మార్పు వుంటుంది. రామయణ కాలంలో 10% "చెడ్డ" వాళ్ళు వుంటే ఇప్పుడు 10% మాత్రమే "మంచి" వాళ్ళు కావచ్చు. "మంచి వాళ్ళము" అనుకొనే వాళ్ళలో కూడా అంతా మంచే వుండదు. మానవ సహజము, చుట్టూ వున్న సమాజ ప్రభావ జనితము అయిన దోషాలకు లోను అవ్వటం, తన చుట్టూ వున్న వాళ్ళు accept చేసే customs, behaviour patterns, attitudes అలవాటు చేసుకోవటం జరుగుతుంది. ఎందుకంటే "Behaviour is contagious" కాబట్టి.
సమాజం లో వుండే చెడుని గుర్తించే ఆలోచనా శక్తి, సంస్కారము , ఆ చెడుని ఎదిరించి నిలబడి కొత్త మార్గం చూపే శక్తి, సామర్థ్యం, నైతిక బలం అందరికీ వుండదు. అట్లాంటి వాళ్ళు చాలా కొద్ది మందే!!.

-మరి అట్లాంటి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇంత వరకూ ఈ దేశం లో పుట్టలేదా?
-అట్లాంటి వాళ్ళు కనీసం గడచిన 1000 సంవత్సరాలలో - అంబేద్కరు, జ్యోతీ రావు ఫూలే కంటే పూర్వం - ఒక్కడూ పుట్టలేదా?
-కనీసం 1% అగ్ర వర్ణాల వాళ్ళు కూడ మంచి వాళ్ళు లేరా?
-అంబేద్కరు కంటే ఎక్కువ కాక పోయినా కనీసం అయనతో సమానంగా దళితోద్ధరణకి పాటు పడిన మహాత్మా గాంధీ కి దళితోద్ధరణ ఉద్యమంలో అంతే పూజనీయ స్ఠానం ఇవ్వ బడుతున్నదా? లేక గాంధీ అగ్ర వర్ణపు వ్యక్తి కాబట్టి ప్రక్కన వుంచబడ్డాడా?
-అస్పృశ్యతా నివారణకై చరిత్ర లో జరిగిన ప్రయత్నాలు ఏమిటో తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారా?
-అట్లా చరిత్రలో అస్పృశ్యతా నివారణకి పాటు పడిన వాళ్ళ బోధనలని/ సందేశాలని ప్రచారం చేస్తున్నారా?
-వారు చేసిన మంచి పనులని గుర్తు చేసుకుంటున్నారా?
-కేవలం తమ కష్టాల గురించి, అవే భావాలని, ఆలోచనలని, కొత్త కవితలలో వివిధ సంఘటనల నేపధ్యం తీసుకొని రాయటమేనా లేక ఆ పూర్వులను, వారి త్యాగాలను గుర్తించి గౌరవాదరాభిమానాలతో నిండిన ప్రేమ పూర్వకమైన- ఒక్క మాట, ఒక్క వాక్యం రాస్తున్నారా?

-"మేము దళితులం, మేము దళితులం....బాధలు, అవమానాలు పడ్డాం" అని పాడిన పాటే పాడటం వల్ల అస్పృశ్యత పోతుందా? వర్గాల మధ్య దూరాలు పెరుగుతాయా లేక తగ్గుతాయా? వర్గ బేధాలు సమసిపోయి సామాజిక ఐక్యత సిద్ధిస్తుందా?

-దేశ శ్రేయస్సు, సమాజ హితం ఎందులో వుంది - హక్కుల కోసం, పదవుల కోసం పోరాడటం లో వుందా? లేక సరియైన భావాలని అందరిలో వ్యాప్తి చేసి అందరినీ ఎకోన్ముఖం చెయ్యటం లో వుందా?

చెడు పోవాలంటే మంచిని పెంచాలా లెక చెడో చెడో అని అరవాలా?.

వూరికే నినాదాలు చేయ్యటం అనేది ఇంకా ఇంకా కుల, వర్గ బేధాలను పెంచే పొలిటికల్ స్టంటే తప్ప జాతీయ ఐక్యతకు, దేశాభివృద్ధికి ఎందుకూ పనికిరాదు.

Wednesday, April 4, 2007

మీకేంటండీ...సాఫ్టువేరు...!!

"ఓ మీరా!! రండి..రండి..ఆ..! బావున్నారా?.. కూర్చోండి..రా బాబూ కూర్చో"

"బావున్నామండీ..మీరు బాగున్నారా?"

"ఆ బావున్నాం.. ఇతనెవరూ?"
...
"మా వాడే...కంప్యూటరు"
...
"మా అక్క కొడుకు...సాఫ్టువేరు"
...
"మా అన్నయ్యగారి అబ్బాయి..హైటెక్ సిటీ లో సాఫ్టువేరు ఉద్యోగం"
...
లేక పోతే "....కంప్యూటరు మీద పని చేస్తున్నాడు..హైదరాబాదులో"

ఇవీ నాకు దొరికే ఇంట్రడక్షన్లు ...

ఇక నెక్స్ట్ ప్రశ్న..

"సాఫ్టువేరంటే బానే ఇస్తారుగా...ఎంతిస్తారో.."
....
"ఎంతొస్తయి బాబూ"
...
"ముప్ఫయి వేలండీ.."
.....
"అబ్బా!! అంతిస్తారా? అసలు మీరు ఏం చేస్తారు? కంప్యూటర్లు తయారు చేస్తారా?"
....
"అన్ని డబ్బులు ఎంజేస్తారు?"
...
"ఇద్దరూ కంప్యూటరు ఉద్యోగాలేగా!! ఇంక మొత్తం సేవింగ్సే అన్న మాట!!"
...
ఎదవ దొబ్బుడు..
....
ఇక రియల్ ఎస్టేట్ వాళ్ళు - "అబ్బా!! అంత రేటా?" అంటే "మీకేంటి సార్ సాఫ్టువేర్ జాబు"
....
ఆటో వాళ్ళు అల్టిమేట్

కొత్తగూడా క్రాస్ రోడ్ నుంచి విప్రో కి 10 రూపాయలు. అదే దూరం ఉప్పల్ రోడ్ లో అయితే 4 రూపాయలు.

అదేమంటే మళ్ళీ స్టార్టు.."మీకేంటండి..." "మీరే ఇవ్వక పొతే ఎట్లా?"
మాములు ఉద్యోగం చేసే వాళ్ళు ఎక్కితే వాళ్ళనీ పీడిస్తారు "అదిగో వాళ్ళు ఇస్తున్నారు..మీరు ఇవ్వండి" అని.

విప్రో నుంచి కాన్‌బే కి 3 రూ. కాని కొత్తగూడా క్రాస్ రోడ్ నుంచి కాన్‌బే కి 15.

కూకట్‌పల్లి నుంచి హైటెక్ సిటీ కి 10 రూ. అది 10KM డిస్టెన్శ్.
హైటెక్ సిటీ నుంచి 1 KM దూరంలో వున్న వానెన్‌బర్గు కి 5 రూ.

అడిగితే "మీరు కూడా ఇవ్వక పొతే ఎట్లా?" అంటారు..

మా ఆవిడ కి చివరికి విరక్తి వచ్చింది. అందుకే ఇక డిసైడ్ అయ్యింది- ఇక ముందు నుంచి ఎవరన్నా అడిగితే "మార్కెటింగ్", "ఫాకల్టీ", ఇట్లాంటివి చెప్పాలని.
.........
అదేమి విచిత్రమో కానీ ఐటి సందట్లో అసలు లాభ పడుతున్న రియల్ ఎస్టేట్ వాళ్ళ గురించి ఎవరూ మాట్లడరు. అందరి నోళ్ళలో పడేది నా లాంటి ఐటి బకరాలే.
......
అసలు ట్రాజెడీ ఏమిటంటే నేనూ, చాలా మంది నా ఐటి ఫ్రెండ్సూ నెలాఖరుకి "ఎవడు అప్పు ఇస్తాడా?" అని చూస్తూ వుంటాము.
మేము సంపాదిస్తున్నవి "క్రెడిట్ కార్డు బిల్లులు, నిల్లు బాంకు బాలెన్సులు".

Monday, April 2, 2007

హైదరాబాద్ లో ఐ.ఎస్.ఐ ఏజెంటు అరెస్టు. - మానవ బాంబు బృంద ప్రవేశం.

ఇస్లామిక్ తీవ్రవాదులు - సెక్యులర్ భాషలో చెప్పాలంటే ఐ.ఎస్.ఐ ఏజెంట్లు - ఢిల్లీ నుంచి గల్లీ దాక పాకిపోయారు. వాళ్ళకి ఇవ్వ బడుతున్న ట్రైనింగ్ ఒకటే - "కాఫిర్" లను చంపాలి; అట్లా చంపితే స్వర్గం లో స్పెషల్ బెర్తు గ్యారంటీ. - అలా ఆ నెట్‌వర్క్ విస్తరిస్తుంటే మనమేమో అదెమీ తెలియనట్టు క్రికెట్ మునిగి తెలుతాం, క్రికెటర్ల దిష్టి బొమ్మలు కాల్చుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతాం.

ఇక్కడ నాకొక డౌటు. తీవ్రవాదుల దృష్టిలో హిందువులు ఎంత కాఫిర్లో, క్రిష్టియన్లూ అంతే కాఫిర్లు కదా. విగ్రహారధకులని చంపాలి అన్న సిద్దాంతం పట్ల వాళ్ళకి అంత నిబద్దతే వుంటే మరి చర్చిల మీద ఎందుకు దాడులు జరగట్లేదు. అపార్థం చేసుకోకండి - నా వుద్దేశం వాటి మీద కూడా జరగాలి అని కాదు. హిందువుల మీద హిందూ, దేవాలయాల మీదే ఎందుకు జరుగుతున్నాయి? అని.
వాళ్ళకు ఏమన్నా ప్రత్యేకమైన అదేశాలు వున్నాయా ఈ రెండో వర్గం జోలికి వెళ్ళద్దని? వుంటే, ఎవరు ఇచ్చి వుంటారు? అదేశాలు ఎలా వుండి వుంటాయి. నా గెస్‌లు...
1) "మీరు ఎమన్నా చేసుకోండి. కానీ "మా వాళ్ళ" జోలికి వెళ్ళకండి"
2) "అక్కడ (ఇండియా లో) మీ వాళ్ళని ఎమన్నా చేయ్యనివ్వండి. కానీ "మా వాళ్ళ" జోలికి వెళ్ళకుండా చూసుకోండి"
3) "మేము చెప్పినట్టు గా అక్కడకి తీవ్రవాదుల్ని పంపండి. కానీ మా వాళ్ళకి ఏమీ కాకూడదు"
4) లేక పొతే మన అంతఃశ్శత్రువులే ఎమన్నా లోపాయకారీ ఒప్పందం చేసుకున్నారా?

మన దేశం లో వున్న టెర్రరిస్టుల వెనుక పాకిస్తాన్ ఒక్కటే వుందంటే నాకు నమ్మ బుద్ది కావట్లేదు.
వాళ్ళు ఎన్నన్నా చెయ్యనీ, మన సిగ్గులేని ప్రభుత్వం పాకిస్తాన్ తో "కలిసి" ఉగ్రవాదం పై పోరాడుతుందట. ఈ డైలాగ్ కూడ ఎవరు చెప్పించారో మన వాళ్ళతో?
వోట్లు అడగటానికి వాళ్ళకి సిగ్గు లేదు. అడిగినప్పుడల్లా వెయ్యటానికి నా లాంటి జనానికి బుద్ది లేదు.

అవునూ ఇంతకీ వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారంటారూ? మీ ఒపీనియన్ ఎమిటో?

Saturday, March 31, 2007

భారత్ - అమెరికా అణు ఒప్పందం.

అమెరికా ప్రభుత్వం తయారు చేసిన "హైడ్" చట్టానికి లోబడిన ఈ అణు ఒప్పందం వల్ల మన డేశానికి ఎంతో నష్టం జరుగనున్నా దీనిని మన శాస్త్రవేత్తలతోనూ, పార్లమెంటు తోనూ ఒప్పించే ప్రయత్నాలు పకడ్బందీగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఒకసారి ఒప్పందం జరిగాక ఇక మన దేశం శాశ్వతంగా శాస్త్ర రంగం లో స్వయం ప్రతిపత్తి ని కోల్పోతుంది. భవిష్యత్తులో మనం మళ్ళీ అణు కార్యక్రమాలను చేపట్టే ప్రయత్నం చేస్తే ఇవ్వళ ఇరాక్ కి పట్టిన గతే మనకూ తప్పదు. భారత్ మీద ఎంతో అభిమానం చూపుతున్నట్లున్న అమెరికా ధోరణి ఎంత నిజమో స్వర్గాన వున్న సద్దాం ని అడిగితే చెప్తాడు. ఆయన్ని అధ్యక్ష పీఠం మీద కూర్చో పెట్టిందీ అమెరికానే; చివరికి ఉరి తీసిందీ అమెరికానే.

శాస్త్రవేత్తలు వద్దంటున్నా మన్‌మోహన్ సర్కారు దీని మీద సంతకానికి అంత అత్యుత్సాహం ఎందుకు చూపిస్తున్నట్టు? అమెరికా నిజమైన వైఖరి ఏమిటి?

Thursday, March 29, 2007

రైలు బండి కాదిది - "బండి రైలు"

కాంబోడియా లో పట్టాల మీద మామూలు రైళ్ళ కంటే ఈ ఫొటోలో కనిపించే "బండి రైళ్ళు" (bamboo trains) ఎక్కువగా తిరుగుతుంటాయి.

ఇవి మన అంధ్రా లో వుండే "తోపుడు బండ్ల" లాగా వుంటాయి. వెదురుతో చేసిన బండికి చిన్న ఇనుప చక్రాలు, ఒక చిన్న ఇంజను, ఒక బ్రేకు లీవరు - ఇదీ దాని design.



ఈ చిన్న దేశంలో అసలు రైలు కంటే ఇవే ఎక్కువ పాపులర్. ఎందుకంటే సర్కారీ వారి రైలు వారానికి ఒక్కసారే వస్తుంది. దాని యొక్క అత్యధిక వేగం 10-15 కి.మీ/గం. అంటే మీరు "రన్నింగ్" లో రైలు ఎక్కి దిగవచ్చన్నమాట. కానీ మన "బండి రైలు" గంటకి 30-40 కి.మీ/గం తో పరుగెత్తుతుంది. పైగా సర్కారీ వారి రైలు కంటే చాలా చవక.
ఎప్పుడైనా సర్కారీ రైలు అడ్డం వస్తే దీనిని పట్టాల మీదనించి ఎత్తి పక్కన పెట్టి రైలు కి దారి ఇస్తారు.

ఈ మధ్యనే పొరుగు దేశాల సహాయంతొ కొత్త రైళ్ళను ప్రవేశపెట్టి రైళ్ళ పరిస్థితి ని మెరుగు పరిచే ప్రయత్నం లో వుందీ వారి ప్రభుత్వం.
ఒక 30 సంవత్సరాల క్రితం వరకూ పరిస్థితి బాగానే వుండేది. కాని "ఖ్మేర్ రోజ్" - "ఎఱ్ఱ కాంబోడియన్" - అనే కమ్మ్యూనిస్టు పాలనలొ ఆ దేశం రాతి యుగానికి వెళ్ళిపోయింది. :(

Saturday, March 24, 2007

గాలి తో నడిచే కారు

ఇప్పుడే http://www.telugupeople.com/ లో ఒక లంకె చూసాను. సబ్జెక్ట్ ఏమిటి అంటే "గాలి తో నడిచే కారు" . చాలా ఇంటరెస్టింగ్ గా వుంది. టాటా మోటర్స్ ప్రొడక్షన్ కూడా మొదలు పెట్టబోతున్నారు. ఈ న్యూసు ఫిబ్రవరి 9 ది. నాకు మాత్రం కొత్త న్యూసే.

ఇందులో ఇంకొక విశేషం ఏమిటి అంటే ఇది తక్కువ వేగం తో వెళ్ళేటప్పుడు గాలి తోనూ, ఎక్కువ వేగంతో వెళ్ళేటప్పుడు గాలి + పెట్రోలు తోను నడుస్తుంది.
ఈ "వాయు యంత్రాన్ని" కనిపెట్టింది ఒక ఫ్రాన్స్ కంపెని. చూ http://www.theaircar.com/.
సరే దీని కథ ఎమిటో ఇంకొంచెం బ్రౌశాక పోస్టుతా.
నాకైతే మన భాగ్యనగరం లో హాయిగా మంచి గాలి పీల్చుతూ బ్రతకవచ్చన్న ఆశ మనసులో కలిగి ఎంతో హాయిగా అనిపిస్తోంది.

ఆరంగేట్రం

శ్రీ మద్‌రమారమణ గోవిందో హరి !!
భక్తులారా! ఇది నా మొదటి పోస్టు.
So యావన్మందికీ మనవి చేసేది ఏమిటంటే...
నేను ఇక్కడ నాకు నచ్చిన జోక్సు, నచ్చిన thoughts, ideas, concepts వగైరాలు...
ఇంకా కొన్ని తెలుగు పద్యాలు, పాటలు, కవితలు, చిన్న చిన్న కథలు పోస్టు చెస్తాను.
వాటితో పాటు నాకొచ్చిన ఇడియాలు, నా ఫీలింగ్సు, నేను చేసిన అనాలసిస్ లు కూడా వేసుకుంటాను.
ఇట్లు
భవదీయ
మన్యవ

PS: కవి తన స్వపరిచయం ఇచ్చుకున్న సందర్భములోనిదీ పోస్టు


Free Blogger Templates by Isnaini Dot Com and Flowers and Decors. Powered by Blogger