Monday, June 18, 2007

పాకిస్తాన్ నుంచి భారీ సంఖ్యలో చొరబాట్లు..2 దశాబ్దాలలో రెట్టింపైన కాశ్మీర్ జనాభా

తీవ్రవాదం తో అట్టుడుకుతున్న కాశ్మీర్ జనాభా గత 25 సం లలో దాదాపు రెట్టింపైంది.
ఒక పక్క ఐదు లక్షల మంది కాశ్మీరీ పండిట్లు, ఇంకా ఇతర హిందువులు అక్కడి నుంచి వలస పోవటం, 30000 వేల మందికి పైగా తీవ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోవటం జరిగానా కూడా జనాభా ఇంత ఎత్తున పెరగటం గమనార్హం. ఈ జనాభా పెరుగుదలకి చాలా కారణాలున్నా మత ఛాందసవాదం పాత్ర చాలా ఉంది.

80 వ దశకం లో భారత ప్రభుత్వం జనాభా పెరుగుదల అదుపుకై దేశ వ్యాప్తంగా సంక్షేమ పథకాలు- కు.ని ఆపరేషన్లు చేయించుకున్న వారికి ఇంక్రిమెంట్లు వంటివి- చేపట్టింది. కాశ్మీర్ లో చాలా మంది ముల్లాలు వీటిని బాహాటంగా వ్యతిరేకించి, అక్కడితో ఆగకుండా ఎక్కువ మంది పిల్లలని కన్నవారికి నగదు బహుమతులు ప్రకటించారు. కొంత మంది అటు మొగ్గారు. కొంతమంది ఇటు.
చాలా మంది ప్రభుత్వోద్యోగులు ఈ పథకాల వల్ల లబ్ధి పొందాక కూడా పిల్లల్ని కని, ఆపరేషన్ సరిగ్గా చేయలేదని వైద్యుల పై తప్పు నెట్టారు.

1989 లో తీవ్రవాదం మొదలుతో కొత్త పోకడలు వచ్చాయి. ఇలాంటి పథకాలు అమలు చేసే ఉద్యోగులకు, వైద్యులకు బెదిరింపులు, బలవంతపు వివాహాలు, బలాత్కారాలు, చొరబాట్లు మొదలయ్యాయి.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని ఆనుకొని ఉన్న బారాముల్లా, కుప్వారా జిల్లాలలో 1981-2001 మధ్య అధిక జనాభా పెరుగుదల నమోదు
అయింది- కుప్వారా 94%, బారాముల్లా 83%. హిందువులు ఎక్కువగా ఉన్న కథువా జిల్లాలో అత్యల్పంగా 46% నమోదయ్యింది. 1991 లో తీవ్రవాదం కారణంగా జనాభా లెక్కలు జరుగలేదు.

ఈ విపరీత పరిణామం అక్కడి ప్రభుత్వ సంక్షేమ పథకాలని కుంటు పరచటమే కాక, అక్కడి పాలకుల అస్థిత్వాన్నే ప్రశ్నిస్తోంది.

0 comments:


Free Blogger Templates by Isnaini Dot Com and Flowers and Decors. Powered by Blogger