శ్రీ P.రాజేశ్వరరావు గారి సంకలనం లో "ప్రసిద్ద్హ తెలుగు పద్యాలు " అనే పుస్తకం ఇప్పటికి 4 ముద్రణలు పూర్తి చేసుకుంది.
పుస్తకం ముందు మాటలో ఇలా వుంది "మన తెలుగు సాహిత్యం లో ప్రసిద్ధమైన పద్యాలు ఎన్నో వున్నాయి. వాటిల్లో పద్యపరంగానూ, భావరీత్యంగానూ - ప్రసిద్ధమైన వాటిని, ప్రశస్త్యమైన వాటిని భారతం, భాగవతం, పారిజాతాపహరణం, కళాపూర్ణోదయం, విజయ విలాసం, సుమతీ శతకం, నరసింహ శతకం, దాశరథీ శతకం మొదలగు గ్రంధాల నుండీ శ్రీనాధుడు, శ్రీకృష్ణదేవరాయలు, అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణుడు, ధూర్జటి, వేమన, చిలకమర్తి లక్ష్మీనరసింహం, తిరుపతి వెంకటకవులు, జంధ్యాల పాపయ్య శాస్త్రి, నార్ల చిరంజీవి, నార్ల వెంకటెశ్వర రావు గార్ల ప్రచురణల నుండీ 250 కి పైగా పద్యాలను సేకరించి, భావంతో ఈ చిరు పుస్తకాన్ని అందిస్తున్నాను" .
మంచి పుస్తకం. తప్పక కొనండి. చదవండి.
ప్రచురణ: "ప్రతిభ పబ్లికేషన్స్, ఫ్లాట్ నెం.2, శ్రీ శంకర్ కాలనీ, ఎల్.బి. నగర్, హైదరాబాద్ - 500 074 "
ప్రతులకు - విశాలాంధ్ర. వెల రూ. 30 /-
ఆ పుస్తకంలో నేను చదివిన కొన్ని ఇక్కడ వేస్తాను.
విజయ విలాసము - చేమకూర వేంకట కవి (17 శతా) - సుభద్ర యౌవన ప్రాదుర్భావము.
అతివ కుచంబులున్ మెఱగుటారును వెనలియున్ ధరాధిపో
న్నతియు నహీనభూతికలనంబు ఘనాభ్యుదయంబు నిప్పుడొం
దితిమీని మాటిమాటికిని నిక్కెడు నేల్గెడు విఱ్ఱవీగెడున్
క్షితి నటుగాదె యొక్కసరికి న్నడుమంత్రపు గల్మి కల్గినన్.
సుభద్ర పుట్టినప్పుడు లేని శోభ ఈ ఎలప్రాయంలో కలిగినందుకు స్తనాలు, నూగారు, కొప్పు విర్రవీగుతున్నాయట. లోకంలో కొందరు నడమంత్రపు సిరి గలిగినప్పుడు ఇలాగే అహంభావం ప్రదర్శిస్తుంటారు. స్తనాలు, నూగారు, కొప్పు ఇవన్నీ స్త్రీలకు మధ్యలో వచ్చేవే కదా.
note: ఇది కవిత్వం కాదు రసికత్వపు కంపు అనుకొనే వాళ్ళు దీన్ని మర్చిపోవచ్చు.
నాకొక డౌటు. ఇట్లాంటి కవిత్వాన్ని తిట్టే వాళ్ళు, (తిట్టే వాళ్ళు మాత్రమే, నేను "అందరూ" అనట్లేదు )తమ నిజజీవితం లో ప్రేమలో పడ్డప్పుడు, పెళ్ళయ్యిన కొత్తలో వారి భార్యలకు ప్రేమ పాఠాలు చెప్తారో లేక ఆర్థిక, సామాజిక అసమానతలు, కులవివక్షతల వర్ణనల కవిత్వం చెప్తారో మరి!. I am not saying such literature is not needed. Everything has its own place. There is a time for each emotion and correspondingly for each type of poetry. One should not detest a particular type just because it does not talk about their group or because of religious prejudices.
Sunday, May 13, 2007
ప్రసిద్ద్హ తెలుగు పద్యాలు
Posted by మన్యవ at 5/13/2007 11:09:00 PM
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
శృంగార రసం యొక్క స్థానం గురించి చక్కటి వివరణ ఇచ్చారు.
Post a Comment