అమెరికాలో 9/11 సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రతి ఏటా శ్రద్ధాంజలి ఘటిస్తారు. యావద్దేశము ఒకసారి వారిని గుర్తు చేసుకొంటుంది. అదంతా టివి లలో వస్తుంది. అది అమెరికా వాళ్ళకే కాక భారతదేశానికి, ప్రపంచం మొత్తానికి వార్తే. కానీ మన దేశంలో మాత్రం పంజాబ్ లోను, కాశ్మీర్ లోను, ఆంధ్రలో నక్సలైట్ల చేతుల్లోను ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక సబర్మతి ఎక్స్ ప్రెస్, రఘునాథ మందిరం, అక్షరథామ్ వంటి వాటికి లెక్కే లేదు. మన ప్రభుత్వం వారిని గుర్తు కూడా చేసుకోదు. మనమన్నా వాలంటైన్స్ డే, ఫాదర్స్ డే , మదర్స్ డే, ఉమెన్స్ డే వీటితో పాటు ఒక "తీవ్రవాద బాధితుల దినం" ఒకటి మొదలు పెట్టి వారికి మన సానుభూతిని తెలియ జేద్దాం. ఇలా చేయటం సమాజం మీద ఎంతో ప్రభావం కలుగిస్తుందని నా నమ్మకం. To feel it "really" demands sincerity, patriotism, a sovereign feeling, a feeling of oneness from a person.
ఏమంటారు? అసలు ఇట్లాంటిది ఒకటి ఆల్రెడీ ఉన్నదా?
Monday, June 18, 2007
తీవ్రవాద బాధితుల దినం
Posted by మన్యవ at 6/18/2007 02:25:00 AM
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
అలాటి దినాలు మనం కూడాచేసుకోవాలంటే ప్రతి రోజూ ఒకటి చెయ్యాల్సి ఉంటుందను కుంటా! మనకున్న తీవ్రవాద గ్రూపులకు మరియు సంఘటనలకు.
Post a Comment