Wednesday, May 9, 2007

పేపర్ వేస్టు, ఇ-వేస్టు : కాలుష్యము , గ్లోబల్ వార్మింగ్

వారం లో రెండు మూడు సార్లు నేను ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు పార్కింగ్ ప్లేస్ లో మెయిల్ బాక్స్ చూస్తాను ఏమన్నా కావాల్సిన ఉత్తరాలు వున్నాయేమో అని. టెలిఫోను బిల్లు కవర్లు, క్రెడిట్ కార్డ్ ఇన్‌వాయిస్ లు వుంటాయి. బిల్లుల్లో దాని తాలుకు వివరాలు మాత్రమే వుండవు. నాకు బిల్లు కట్టటం సులభం చెయ్యటం కోసం వాడు ఒక రిటర్న్ పోస్టు కవరు ఇస్తాడు నేను బిల్లు పేమెంట్ చెక్ పంపటానికి. ఇది కాక రెందు టావుల నిండా కొత్త ఆఫర్ల వివరాలు, ఛారిటీ కి డొనేట్ చెయ్యమంటూ అడిగే ప్రకటనలు ఉంటాయి. మామూలు ఉత్తరాలతో పాటు రియల్ ఎస్టేట్ ఆడ్‌లు, పిజ్జా హట్ ఆఫర్ పాంప్లిట్లు, ఫర్నిచర్ షాపు డిస్కౌంట్ ఆఫర్ యాడ్ లతో బాక్సు నిండి పోయి వుంటుంది.

ఇవన్నీ చూస్తే ఎంత పేపరు వృధానో అనిపిస్తుంది. ఇట్లా ఊరినిండా రోజు ఎన్ని వేల పాంప్లిట్లు వస్తున్నాయో వాటి వల్ల రోజూ ఎన్ని టన్నుల కాగితం వృధా అవుతుందో, ఆ కాగితాన్ని తయారు చెయ్యటం లో ఎంత పొల్యూషన్ పెరిగి వుంటుందో ఇంకా ఇట్లా ఎనెన్ని నగరాల్లో ఎంత కాగితం వేస్ట్ అవుతుందో తలుచుకుంటే నాకు చాలా బాధేస్తోంది. పేపర్ లెస్ సమాజం వస్తే ఎలా వుంటుందో?

కాని కంప్యూటరైజేషన్ వల్ల కూడా కాలుష్యం తక్కువేమీ లేదు. నిన్న టివి లో చూపించాడు- యుఎస్, యూరోప్ ల నుండి ఇ-వేస్ట్ (మానిటర్లు, మదర్ బోర్డులు etc) అంతా బాంబే చుట్టూ పక్కల ఊళ్ళకి వస్తోంది. మన స్క్రాప్ వ్యాపారం చేసే వాళ్ళు దాన్నంతా కొని ఇక్కడకు తెచ్చి ఇక్కడ రీ సైక్లింగ్ అట. ఈ వ్యాపారులు ప్రమాదకరమైన, విషపూరితమైన పనికిరాని విడి భాగాలను ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోకుండా సముద్రం లో ను, తాగే నీటి వనరుల్లోను కలిపేస్తున్నారు. ఎమిటొ...? సర్లెండి..ఎక్కువ ఆలోచించి పెద్ద ప్రయోజనం లేదు.

4 comments:

Srini said...

ఒకసారి మీరు అమీరుపేట మైత్రివనం వద్దకొచ్చి చూస్తే మీరు ఇంకా బాధ పడతారు. అక్కడి కంప్యూటర్ సంస్థలు కొన్ని వేల పాంప్లెట్లు ప్రతి రోజూ వచ్చేపొయే వాళ్లకి పంపిణీ చేస్తూంటాయి. సాయంకాలం అయ్యేసరికి రోడ్డు కనపడకుండా తయారవుతుంది పేపర్ వేస్ట్, ఏమి చేస్తాం ఎవరికీ ఈ గొడవ పట్టదు, ఎవరి బిజీ వాళ్లు.

రాధిక said...

కాలేజ్ గేట్ల దగ్గరా ఇదే పరిస్తితి.కాగితాన్ని తొక్కకూడదు అంటారు.కానీ కాలేజ్ లోకి వెళ్ళాలన్నా ,బయటకి రావాలన్నా కార్పెట్ మీద నడిచినట్ట్లు వాటిని తొక్కుకుంటూ తిరగాల్సిందే.

rākeśvara said...

నాకూ ఈ విషయాల గురించి ఆలోచించి చాలా బాధేస్తుంది. మొన్ననే రెండు టపాలు వేసా environmentalism మీద.

మన వాళ్ళకు నిజంగా అవగాహన చాలా తక్కువ.
కంప్యూటర్ల నుండి వచ్చే లెడ్ చాలా విషపూరితమైనది.
మంచి నీరు, మరియు ఇతర వనరులు కరువైన దేశానికి సాక్షాత్తు చావు దిగిమతి చేస్తున్నట్టుంది యవ్వారం..

Naveen Garla said...

ఇది చూడండి....ఇతర కంపెనీలకు స్పూర్తిగా నిలుస్తున్నందుకు యహూ కి చెతులెత్తి నమస్కరించాలి
http://green.yahoo.com/


Free Blogger Templates by Isnaini Dot Com and Flowers and Decors. Powered by Blogger