Wednesday, June 13, 2007

RTS , Inscript - ఏది బెస్టు?

నిన్న చరసాల ప్రసాదు గారు, కొత్త పాళీ గారు నా పలక గురించి తెలుగుబ్లాగు లో రాసిన వ్యాఖ్యలు చూసాక దీని గురించి రాద్దామనిపించింది.

"ఏది బెస్టు?".. అంటే..ఏదీ కాదు... "మనకు" ఏది బెస్టో చెప్పచ్చు...మన టైపింగ్ శైలి బట్టి, అలవాటు బట్టి.
టైపు రకరకాలుగా చేస్తారు.
1)ప్రోగ్రామింగ్ లో కి వచ్చాక టైపు మొదలు పెట్టిన మా స్నేహితులు ఉన్నారు. మొదట్లో టెక్నాలజీ తొందరగా నేర్చుకోవటం ముఖ్యం కాబట్టి కీ బోర్డు చూసి టైపు చెయ్యటం స్టార్ట్ చేస్తారు. రెండు వేళ్ళతో చేస్తున్నామా లేక 10 వేళ్ళతో చేస్తున్నామా అని పట్టించుకోరు. ఇక అలాగే అలవాటు అవుతుంది. ఇదేదో తప్పు అని కాదు- అలవాటు గురించి చెప్తున్నా.

2)నాకు మా లెక్చరర్, టైపు నేర్చుకోమని చెప్పారు డిగ్రీలో ఉండగా..అలా నాకు కీ బోర్డు చూడకుండా 10 వేళ్ళతో చేయటం అలవాటు అయింది.
3)ఈ రెంటికీ మధ్య లో చాలా మంది ఉంటారు. ఒక 4-5 వేళ్ళు వాడుతూ, మధ్యమధ్యలో కీ-బోర్డు చూస్తూ చేస్తారు.

మీరు పై వాటిల్లో 1 వర్గానికి చెందితే RTS ఈజీగా అనిపిస్తుంది.
నాకు inscript ఈజీ. ఎందుకంటే నేను వేళ్ళకి అక్షరాలని అలవాటు చేస్తాను కాబట్టి. నాకు అది mechanical process.
RTS నాకు inconvenient. నాకు "RTS" వల్ల "case sensitive consciousness" ఎక్కువ అవుతుంది. పేర్లు టైపు చేసేటప్పుడు "భారతి" అని టైపు చెయ్యవలసి వస్తే నేను "BArati" అని చెయ్యబోతాను. మళ్ళీ సరిచేయాలి. అలాగే తెలుగులో బాగా కలసి పోయిన పదాలు.
ఎలక్షన్ :- "election" -english , "elakshan" - RTS.
డైరీ :- "diary" - english, "DairI" - RTS
ఇంకా స్పెల్లింగ్ మనసులో అనుకుంటూ టైపు చేస్తా కాబట్టి వేగం మందగిస్తుంది.
ఈ రెండు కారణాల వల్ల నేను inscript కి మారాను.

అయితే 2 వ వర్గానికి చెందిన వాళ్ళలో చాలా మంది RTS బాగా అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు.
కానీ టైపు వచ్చిన వాళ్ళు, కొత్తగా తెలుగు వాడటం మొదలు పెడితే inscript అలవాటు చేసుకోవటం ఉత్తమమని నా అభిప్రాయం.

మీరు 3 వ వర్గానికి చెందితే మీరు కూడా inscript అలవాటు చేసుకోవటం మంచిదని నా భావన.

రెండూ చూసి మీకేది మంచిదో నిర్ణయించుకోండి.
పలక

8 comments:

rākeśvara said...

బాగా రాసారు మాన్యవ్
Efficient గా టైపు చేసే వారికి ఇన్ స్క్రిప్టే నయం.

ఇంకోటి,
నేను అమెరికా లో అందరూ పది వేళ్ళతో టైపు చేసేవారినే చూసా , రెండో వర్గానికి చెందినవారినే చూసా. వీళ్ళు ఎప్పుడైనా productivity కి చాలా ప్రాముఖ్యత ఇస్తారు.

సిరిసిరిమువ్వ said...

మన్యవ గారూ మీ ప్రయత్నం చాలా బాగుంది. మీ మిని, పలక బాగున్నాయి. ఒక చిన్న సవరణ, మీ పలక మొదటి పాఠం లో కుడిచేయి ఉంగరం వేలు "x" కి వాడతాం అని చెప్పారు, కానీ "x" కి ఎడమ చేతి ఉంగరం వేలు కదా! ఎడమ కుడి అయిందనుకుంటాను!!! మీ పాఠం పేజిలో నిలువుగా కాకుండా అడ్డంగా ఉంటే చదవటానికి వీలుగా ఉంటుంది.

S said...

I was expecting that somebody will write this article soon...
Well.. I dont see the keyboard most of the time..not do I use shift that much... But.still, I feel..for me RTS is the best thing.... I am a very quick typer..though I never learnt typing... but..then..somehow, I never got anywhere nearer to inscript... RTS is something I like a lot....

S said...

Thanks again for the article.

రవి వైజాసత్య said...

ఈ పలక సూపర్ గురూ..చాలా బాగుంది. మరిన్ని పాఠాలకోసం వేచిచూస్తున్నను.
నేను మీరు చెప్పిన మూడో వర్గం టైపరిని. కీబోర్డు బాగా అలవాటై అప్పుడప్పుడు మాత్రమే కీబోర్డును చూస్తుంటాను. ఇన్స్క్రిప్టులో కూడా ఒక మాదిరి ప్రావీణ్యం సంపాదించాను కానీ ఆఫీసులో మాక్ వాడటం వలన RTS ఉపయోగించక తప్పడం లేదు..మాక్ ఉపయోగిస్తే ఇక మీకు RTS యే శరణ్యం

spandana said...

బాబ్బాబు నేనెక్కడా ఇది బెస్టు అనలేదండోయ్!
నిజానికి పదివేళ్ళతో టైపు చేయలేని నా అసమర్థతకి జాలి పడుతో వుంటాను. ఇన్ని రోజులూ inscript ఆఫీసులో జాగృతం చేయడం వీలుకాదని తప్పించుకున్నాను. కానీ మీ "పలక" వచ్చి ఆ సాకును సాఫీ చేసిందే అని కాస్తంత దిగులు. :(

నేను పదివేళ్ళతో టైపు చేయకపోయినా productivityకి ప్రాధాన్యతనిస్తాను. :)

-- ప్రసాద్
http://blog.charasala.com

మన్యవ said...

సిరిసిరిమువ్వ గారు, తప్పులు సరి చేస్తాను. అలాగే పాఠం ప్లేస్ కూడా..

రవి వైజాసత్య గారు, "మినీ" మాక్ లో పని చేయదా? అది జాలకం (browser) లో కదా పని చేసేది. మాక్ లో కూడా పని చేయాలే?

ప్రసాద్ గారు, మీరు ఏదో అన్నారని కాదు. మీరు కొన్ని వేళ్ళతోనే టైపు చేస్తామని రాసింది చూసాక నాకు ఈ పోస్టు రాయాలన్న ఆలోచన వచ్చింది అని నా ఉద్దేశం.
Dear S, I agree with you. Its all a matter of habit. I am presenting my tastes and arguments.

రవి వైజాసత్య said...

అవును కదా ఇప్పుడు మినీ వచ్చేసింది..నేను మినీని మాక్ లో పరీక్షించి చెబుతా..పనిచేస్తుందనే అనుకుంటా ఎందుకంటే లేఖిని పనిచేస్తుంది కదా..


Free Blogger Templates by Isnaini Dot Com and Flowers and Decors. Powered by Blogger