Sunday, September 13, 2009

రాకెట్ దాడి పై పాకిస్తాన్ మీడియా కథనం

ఈ రోజు ఈనాడు లో పాక్ జరిపిన రాకెట్ దాడి గురించి వార్త వచ్చింది. ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు నేను పాక్ వాళ్ళ కథనం ఏమిటో చూస్తాను.
డాన్ పేపర్ లో వచ్చిన వార్త చూడండి.
http://www.dawn.com/wps/wcm/connect/dawn-content-library/dawn/news/pakistan/03-indian-forces-fire-across-pakistan-border-ss-04

వారికే పాపం తెలీదట. వారికి విచారించే సమయం ఇవ్వకుండా భారత్ వారిపై కాల్పులు జరిపిందట. వాళ్ళు పెద్ద మనసు తో ఊరుకన్నారట.
పాకిస్తాన్ సైన్యం గాంధీగిరి చేపట్టిందనుకుంటా.

3 comments:

oremuna said...

సాధారణంగా ఇటువంటి దాడులు ట్రైనింగ్ తీసుకున్న తీవ్రవాదులను కంచె దాటించేప్పుడు చేస్తారు. మరీసారి ఎంత మందిని దాటించారో.

Anonymous said...

oremuna కరాచి వరకు ఉన్న రైలు మార్గం ద్వార ఈ సారి ఐదు వేల మంది పాకిస్తాన్ వాళ్ళు భారత్ లోకి శాస్వతంగా వచ్చేసినట్టు లెక్కలు. లెక్కల్లో లేనివాళ్ళెంతమందో వచ్చిఉంటారు, అట్లా రాజ బాట ఉమ్డగా ఇంక దాడులెందుకు!

Anil Dasari said...

పాకిస్తాన్ సైన్యం రాకెట్ దాడులు చేస్తుంది, బంగ్లాదేశ్ రైఫిల్స్ మన జవాన్లని చిత్రహింసలు పెట్టి చంపుతారు, చైనా అంగుళం అంగుళంగా లోపలికి చొచ్చుకొస్తుంది. ఎవరి చేతగానితనం? రేపో ఎల్లుండో బర్మా, నేపాల్, శ్రీలంక, మాల్దీవ్స్ కూడా మొదలెడతాయి చూడండి.


Free Blogger Templates by Isnaini Dot Com and Flowers and Decors. Powered by Blogger