Thursday, July 30, 2009

మైనారిటీ ముస్లిము ల పై సి.పి.యం దాడులు

మైనారిటీల్లారా ఏకంకండి!!

ముస్లిం అనుకూల పార్టీగా తనని తాను చిత్రించుకొనే సి.పి.యం తన నిజ స్వరూపం బయట పెట్టింది.
తమ అధికారానికీ, ఆధిక్యతకూ, పెత్తనానికీ అడ్డొస్తే హిందువులైనా , ముస్లిములైనా ఎవరైనా ఊచకోత కోస్తామని చెప్పకనే చెప్పింది.
ఆ పార్టీ కార్యకర్తలు నిన్న బెంగాల్ లోని బర్థమాన్ జిల్లాలో ఒక ముస్లిం టీచరును హతమార్చారు. మరొక ముస్లిమును తీవ్రంగా గాయపర్చగా అతను చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

కాంగ్రస్ ౨ వ సారి అధికారం లోకి వచ్చాక ఇలా ముస్లిం లపై దాడులు పెరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తనట్టు వ్యవహరించటం ఆందోళన కలిగిస్తోంది.

ఆంధ్ర ప్రాంత ముస్లిములంతా ఏకమై బెంగాలు సోదరులకు తమ సంఘీభావం తెలపాలి, అలాగే నేరస్థులను తక్షణమే శిక్షించటానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలి.

1 comments:

Anonymous said...

" ముస్లిములు " అనైనా అనండి. " మైనారిటీలు " అనైనా అనండి.
" మైనారిటీ ముస్లిములు " ఏమిటి ? " మెజారిటీ ముస్లిములు " కూడ ఉంటారా ?
ముస్లిములైనా, హిందువులైనా అక్రమంగా జరిపే ఏ దాడినైనా ఖండించ వలసిందే !


Free Blogger Templates by Isnaini Dot Com and Flowers and Decors. Powered by Blogger