"నేనూ మార్గదర్శ లో చేరాను. ఒక డొమైన్ పెట్టుకున్నాను. పేరు తెలుగుప్రతిభ.ఆర్గ్. ప్రస్తుతానికి నా ట్రేడ్ మార్కు పలక మాత్రమే ఉన్నది అందులో. నెమ్మదిగా నాబ్లాగు, ఆ తరువాత నా టెక్నికల్ రాతలు చేరవేస్తాను.
Saturday, June 23, 2007
Monday, June 18, 2007
తీవ్రవాద బాధితుల దినం
అమెరికాలో 9/11 సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రతి ఏటా శ్రద్ధాంజలి ఘటిస్తారు. యావద్దేశము ఒకసారి వారిని గుర్తు చేసుకొంటుంది. అదంతా టివి లలో వస్తుంది. అది అమెరికా వాళ్ళకే కాక భారతదేశానికి, ప్రపంచం మొత్తానికి వార్తే. కానీ మన దేశంలో మాత్రం పంజాబ్ లోను, కాశ్మీర్ లోను, ఆంధ్రలో నక్సలైట్ల చేతుల్లోను ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక సబర్మతి ఎక్స్ ప్రెస్, రఘునాథ మందిరం, అక్షరథామ్ వంటి వాటికి లెక్కే లేదు. మన ప్రభుత్వం వారిని గుర్తు కూడా చేసుకోదు. మనమన్నా వాలంటైన్స్ డే, ఫాదర్స్ డే , మదర్స్ డే, ఉమెన్స్ డే వీటితో పాటు ఒక "తీవ్రవాద బాధితుల దినం" ఒకటి మొదలు పెట్టి వారికి మన సానుభూతిని తెలియ జేద్దాం. ఇలా చేయటం సమాజం మీద ఎంతో ప్రభావం కలుగిస్తుందని నా నమ్మకం. To feel it "really" demands sincerity, patriotism, a sovereign feeling, a feeling of oneness from a person.
ఏమంటారు? అసలు ఇట్లాంటిది ఒకటి ఆల్రెడీ ఉన్నదా?
Posted by మన్యవ at 6/18/2007 02:25:00 AM 1 comments
పాకిస్తాన్ నుంచి భారీ సంఖ్యలో చొరబాట్లు..2 దశాబ్దాలలో రెట్టింపైన కాశ్మీర్ జనాభా
తీవ్రవాదం తో అట్టుడుకుతున్న కాశ్మీర్ జనాభా గత 25 సం లలో దాదాపు రెట్టింపైంది.
ఒక పక్క ఐదు లక్షల మంది కాశ్మీరీ పండిట్లు, ఇంకా ఇతర హిందువులు అక్కడి నుంచి వలస పోవటం, 30000 వేల మందికి పైగా తీవ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోవటం జరిగానా కూడా జనాభా ఇంత ఎత్తున పెరగటం గమనార్హం. ఈ జనాభా పెరుగుదలకి చాలా కారణాలున్నా మత ఛాందసవాదం పాత్ర చాలా ఉంది.
80 వ దశకం లో భారత ప్రభుత్వం జనాభా పెరుగుదల అదుపుకై దేశ వ్యాప్తంగా సంక్షేమ పథకాలు- కు.ని ఆపరేషన్లు చేయించుకున్న వారికి ఇంక్రిమెంట్లు వంటివి- చేపట్టింది. కాశ్మీర్ లో చాలా మంది ముల్లాలు వీటిని బాహాటంగా వ్యతిరేకించి, అక్కడితో ఆగకుండా ఎక్కువ మంది పిల్లలని కన్నవారికి నగదు బహుమతులు ప్రకటించారు. కొంత మంది అటు మొగ్గారు. కొంతమంది ఇటు.
చాలా మంది ప్రభుత్వోద్యోగులు ఈ పథకాల వల్ల లబ్ధి పొందాక కూడా పిల్లల్ని కని, ఆపరేషన్ సరిగ్గా చేయలేదని వైద్యుల పై తప్పు నెట్టారు.
1989 లో తీవ్రవాదం మొదలుతో కొత్త పోకడలు వచ్చాయి. ఇలాంటి పథకాలు అమలు చేసే ఉద్యోగులకు, వైద్యులకు బెదిరింపులు, బలవంతపు వివాహాలు, బలాత్కారాలు, చొరబాట్లు మొదలయ్యాయి.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని ఆనుకొని ఉన్న బారాముల్లా, కుప్వారా జిల్లాలలో 1981-2001 మధ్య అధిక జనాభా పెరుగుదల నమోదు
అయింది- కుప్వారా 94%, బారాముల్లా 83%. హిందువులు ఎక్కువగా ఉన్న కథువా జిల్లాలో అత్యల్పంగా 46% నమోదయ్యింది. 1991 లో తీవ్రవాదం కారణంగా జనాభా లెక్కలు జరుగలేదు.
ఈ విపరీత పరిణామం అక్కడి ప్రభుత్వ సంక్షేమ పథకాలని కుంటు పరచటమే కాక, అక్కడి పాలకుల అస్థిత్వాన్నే ప్రశ్నిస్తోంది.
Posted by మన్యవ at 6/18/2007 01:02:00 AM 0 comments
Wednesday, June 13, 2007
RTS , Inscript - ఏది బెస్టు?
నిన్న చరసాల ప్రసాదు గారు, కొత్త పాళీ గారు నా పలక గురించి తెలుగుబ్లాగు లో రాసిన వ్యాఖ్యలు చూసాక దీని గురించి రాద్దామనిపించింది.
"ఏది బెస్టు?".. అంటే..ఏదీ కాదు... "మనకు" ఏది బెస్టో చెప్పచ్చు...మన టైపింగ్ శైలి బట్టి, అలవాటు బట్టి.
టైపు రకరకాలుగా చేస్తారు.
1)ప్రోగ్రామింగ్ లో కి వచ్చాక టైపు మొదలు పెట్టిన మా స్నేహితులు ఉన్నారు. మొదట్లో టెక్నాలజీ తొందరగా నేర్చుకోవటం ముఖ్యం కాబట్టి కీ బోర్డు చూసి టైపు చెయ్యటం స్టార్ట్ చేస్తారు. రెండు వేళ్ళతో చేస్తున్నామా లేక 10 వేళ్ళతో చేస్తున్నామా అని పట్టించుకోరు. ఇక అలాగే అలవాటు అవుతుంది. ఇదేదో తప్పు అని కాదు- అలవాటు గురించి చెప్తున్నా.
2)నాకు మా లెక్చరర్, టైపు నేర్చుకోమని చెప్పారు డిగ్రీలో ఉండగా..అలా నాకు కీ బోర్డు చూడకుండా 10 వేళ్ళతో చేయటం అలవాటు అయింది.
3)ఈ రెంటికీ మధ్య లో చాలా మంది ఉంటారు. ఒక 4-5 వేళ్ళు వాడుతూ, మధ్యమధ్యలో కీ-బోర్డు చూస్తూ చేస్తారు.
మీరు పై వాటిల్లో 1 వర్గానికి చెందితే RTS ఈజీగా అనిపిస్తుంది.
నాకు inscript ఈజీ. ఎందుకంటే నేను వేళ్ళకి అక్షరాలని అలవాటు చేస్తాను కాబట్టి. నాకు అది mechanical process.
RTS నాకు inconvenient. నాకు "RTS" వల్ల "case sensitive consciousness" ఎక్కువ అవుతుంది. పేర్లు టైపు చేసేటప్పుడు "భారతి" అని టైపు చెయ్యవలసి వస్తే నేను "BArati" అని చెయ్యబోతాను. మళ్ళీ సరిచేయాలి. అలాగే తెలుగులో బాగా కలసి పోయిన పదాలు.
ఎలక్షన్ :- "election" -english , "elakshan" - RTS.
డైరీ :- "diary" - english, "DairI" - RTS
ఇంకా స్పెల్లింగ్ మనసులో అనుకుంటూ టైపు చేస్తా కాబట్టి వేగం మందగిస్తుంది.
ఈ రెండు కారణాల వల్ల నేను inscript కి మారాను.
అయితే 2 వ వర్గానికి చెందిన వాళ్ళలో చాలా మంది RTS బాగా అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు.
కానీ టైపు వచ్చిన వాళ్ళు, కొత్తగా తెలుగు వాడటం మొదలు పెడితే inscript అలవాటు చేసుకోవటం ఉత్తమమని నా అభిప్రాయం.
మీరు 3 వ వర్గానికి చెందితే మీరు కూడా inscript అలవాటు చేసుకోవటం మంచిదని నా భావన.
రెండూ చూసి మీకేది మంచిదో నిర్ణయించుకోండి.
పలక
Labels: ౦
Posted by మన్యవ at 6/13/2007 09:16:00 AM 8 comments