>Naveen's post in telugublog group
>On Aug 3, 9:39 pm, నవీన్ గార్ల
> hardware = కఠినాంత్రము
> software = కోమలాంత్రము
నా దృష్టి లో పదాలను సృష్టించటానికి అనువాదపద్దతి కంటే పూర్తిగా కొత్త శబ్దాలని కనిపెట్టటానికి ప్రయత్నించడం మేలు.
(*) Pronounciation & Ease of use
ఇంగ్లీషు భాష పదకోశం అంతా మనంత నిర్దుష్టంగా పలకాల్సిన అవసరం లేని పదాలతో ఉంటుంది.
వాళ్ళ pronounciation కూడా అంతే ఉంటుంది. ex: "హిందూ ధర్మ" అనమంటే "HhinDoo Daarma" అనటం చూసా TV లో. అనువదించిన పదాలు ఇంగ్లీషు వాటంత సులువుగా ఉండవు. మనం పెద్ద పెద్ద క్లిష్ట పదాల పట్టిక తయారు చేసి తెలుగు ని unusable గా చేసే ప్రమాదం ఉంది.
(*)Glamour
ఒక పదాన్ని అనువదించటం వల్ల ప్రజలు ఆ తెలుగు పదాన్ని దాని తాలూకు ఇంగ్లీషు పదంతో పోల్చటం మొదలు పెడతారు. పై ఉదాహరణ నే తీసుకుంటే "కోమలాంత్రము" కంటే " software" ఈజీ గా ముఖ్యంగా "స్టైలిష్" గా ఉందని భావిస్తారు. తెలుగు పదం "glamour less" గా కనిపిస్తుంది. దాని వల్ల నలుగురి లో ఉన్నప్పుడు ఆ తెలుగు పదాన్ని పదాన్ని వాడితే నవ్వుతారేమో అని జంకే అవకాశం ఉంది.
(*) అనువదించటం వల్ల అవి మన సొంత పదాలు కాదని చెప్పకనే చెప్పనట్టవుతుంది.
సులభంగా ఉండే కొత్త శబ్దాలు కనిపెడితే అవన్నీ మన పదాలు అని గర్వంగా చెప్పుకోవచ్చు వాడకం కూడా పెరుగుతుంది. కానీ బాగా ప్రచారం అవసరం.
ex: operating system - (translation) నిర్వాహక వ్యనస్ధ - (different word): హలోక.
Byte - - దిమిని.
"ఎలా వచ్చింది"? అంటే... "అదంతే!" అని సమాధానం.
కాకపోతే తెలుగు పండితులు ఈ పద్దతిని "systematize" చెయ్యచ్చు so that every other person will not start coining his own words.
Monday, August 6, 2007
కొత్త తెలుగు పదాలు సృష్టించటం
Posted by మన్యవ at 8/06/2007 05:21:00 PM
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
వెరీ గుడ్డు .. పదాలు కనిపెట్టకపోతె కొత్త పదాలు ఎలా వస్తాయి.. వెసుకో రెండు వీర తాళ్ళు
ఇదే అంశం మీద తెలుగు పదం గుంపులో పెద్ద చర్చ జరుగుతోంది, చదవండి: http://groups.google.com/group/telugupadam/browse_thread/thread/9ac2a622d8135ed8
మీకు తోచిన ..సరైనదనిపించిన తెలుగుపదాలని తప్పక సూచించండి.
సిలికానాంఢ్ర వారి సుజనరంజని జాలపత్రికలో ఆచార్య వేమూరి గారు నిర్వహిస్తున్న వీరతాళ్ళు శీర్షిక చూడండి - ఉత్సాహం ఉంటే పాల్గొనండి.
Post a Comment