మొన్న టి.వి లో హగ్గీస్ ప్రకటన చూశా. కాప్షన్ "..తడితనం..తో పోరాటం".. అట. ఇదెక్కడి తెలుగో.."చిన్నతనం","ముసలితనం" ఇవి విన్నాం... తడితనం మాత్రం నాకు కొత్తే... "గీలాపన్" కి అనువాదం అనుకుంటా..యాడ్ ఏజెన్సీ రైటర్స్ ని అర్జంటుగా బాగు చేయాలి.
Thursday, August 2, 2007
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
తడితనం బాగానే ఉన్నది కదా!
జనాలకు అర్థం అవుతుంది, బూతు లేదు
మీ అభ్యంతరమేమిటి? కొత్తంతా చెత్తనా?
"తనం"/"దనం" ఈ context లో నప్పవని నా ఫీలింగ్..
మ్...దనం OK అనుకుంటా. వెచ్చదనం , చల్లదనం ఉన్నాయి కానీ "వెచ్చతనం" లేదుగా.
మీ మొదటి ఊహే కరక్టు. ఇది దనం/తనం తేడా కాదు - ఆ ప్రయోగం తెలుగులో సహజం కాదు, అంతే.
తెలుగు ప్రకటనలకి ఇది కొత్తగా వచ్చిన జాడ్యం కాదు - ఎప్పణ్ణించో ఉన్నదే. నా చిన్నప్పుడు తెలుగు పత్రికల్లో నేషనల్ బ్రాండ్స్ ప్రకటనలు చాలా ఎబ్బెట్టుగా ఉండేవి. ఇలాంటి వాటిని "అనువాద సమస్యలు" అనే పుస్తకంలో రాచమల్లు రామచంద్రా రెడ్డి బాగా ఉతికారు.
తెలుగులో తడి విశేషణమే కాదు నామవాచకం కూడా - ఈ సందర్భంలో తడితో పోరాటం అంటే సరిపోతుంది.
ఈమధ్యే ఈ విషయాన్ని నేనూ ఒకచోట రాసుకున్నా.
Post a Comment