Tuesday, July 24, 2007

హైదరాబాదు "బ్యూటిఫికేషన్" - రోడ్డు డివైడర్ల ప్రహసనం

నేను హైదరాబాదు లో సెటిల్ అయినప్పటి నుంచి చూస్తున్నాను మన హుడా వారి మాయ.

ఫస్ట్ ఏమీ లేని రోడ్డు మీద 6 అంగుళాల ఎత్తున్న డివైడర్ వేస్తారు.
తరువాత సీజన్ లో వాన పడగానే 6 అంగుళాల మందం రోడ్డు మళ్ళీ వేస్తారు. ఇప్పుడు డివైడర్ రోడ్డులో కలసి పోయిందని 12 అంగుళాల ఎత్తున్న డివైడర్ వేస్తారు.

నెక్స్ట్ సీజన్ : రోడ్డు మరో 6 అంగుళాల మందం పెంపు. డివైడర్ కూడా ఒకటిన్నర అడుగుల ఎత్తు అడుగు వెడల్పుతో ఒళ్ళు చేయటం మొదలెడుతుంది.

పై సీజన్ : మళ్ళీ తారు పూత. ఇప్పుడు డివైడర్ సైజు 2 అడుగులు ఎత్తు , 2 అడుగులు వెడల్పు. ఇక మోకాలి నొప్పుల ముసలి వాళ్ళు అది దాటలేరన్నమాట.

ఆ పై సీజన్ :రోడ్డు మరో 6 అంగుళాలు. డివైడర్: 2 1/2 అడుగులు ఎత్తు , 3 అడుగులు వెడల్పు, మధ్యలో మట్టి-అందులో మెక్కలు. ఈ పాటికి అది క్రికెట్ పిచ్ లాగా కనిపిస్తుంటుంది.

ఏడాదిన్నర తరువాత: ట్రాఫిక్ కి రోడ్డు చాలట్లేదని డివైడర్ మొత్తం తీసేసి రోడ్డు వేసేస్తారు.

ప్రతి రోడ్డుదీ ఇదే పరిస్థితి. బ్యూటిఫికేషన్ పేరుతో జరుగుతున్న ఈ దోపిడీ ని మనం ప్రశ్నించలేమా? అరికట్టటం ఎలా?

3 comments:

Anonymous said...

బ్యూటిఫికేషన్ అంటే ఆ మాత్రం తెలీదా. మొహానికి క్రీములు లోషన్లు వేసుకోవడమే కాదు అప్పుడప్పుడూ ఫేస్ లిఫ్టింగూ, వంకర సర్జరీలు చేస్తారు కదా. అలాగే ఇది కూడానూ. మొహాన్ని ప్రతి రోజూ కడుక్కున్ని క్రీము పెట్టి పౌడరద్దినట్టి రోడ్లను కూడా ఇలా సుందరీకరణ చేస్తారు. పనిలో పనిగా కంట్రాక్టరు ఇల్లు, కారు మొదలైనవి ధనీకరణ గావించ బడుతాయి.


-- విహారి

spandana said...

మళ్ళి వేయటం అటుంచినా..ఆ వేయడంలో కూడా ఓ పద్దతి, పాడూ అంటూ వుండవనుకుంటా!
ఇక్కడైతే రోడ్డును ఆధునీకరించాలంటే ముందుగా బెత్తెడు లోతుగా వున్న రోడ్డును గొకేస్తారు. గోకేసిన రోడ్డును దుమ్ములేకుండా వూడ్చి వేస్తారు. ఆపైన అంతే మందంతో తారు వేస్తారు. ఇవన్నీ పక్కా ప్రణాళికతో జరుగుతాయి గనుక ఇంతకుముందు రోడ్డు ఎంత ఎత్తులో వుండేదో తారు వేశాకా అంతే ఎత్తులో వుంటుంది. రోడ్డు, వంతెన కలుసుకుంటున్న చోట గానీ, మ్యాన్ హోల్స్ దగ్గర గానీ ఎచ్చుతగ్గులు అనేవే వుండవు.
నేను హైదరాబాదులో తిరుగుతున్న రోజుల్లో MGరోడ్డు మీద ఓ మ్యాన్ హోల్ వుండేది రోడ్డు మద్యన అడుగు ఎత్తున. ఏ మాత్రం ఏమారి వున్నా స్కూటర్ దానికి గుద్దుకుందో ఇక బ్యాలన్స్ తప్పడమన్నా జరగాలి లేదా స్కూటర్‌కు బొక్కన్నా పడాలి. అంత సంచారం వున్న చోట అంత నడిమధ్యలో అలా వుంచిన వారిమీద రోజూ విసుక్కునే వాన్ని. ఇక నగరరోడ్ల గురించి తెలియని వాడైతే అంతే సంగతులు.
ఇలాంటి విశయాలని వీళ్ళు మళ్ళి పరిశోధనలు చేసి కనిపెట్టక్కర లేదు ఇప్పటికే అభివృద్ది చెందిన దేశాలను చూసి నేర్చుకోవచ్చు. మనవాళ్ళు చూసి వస్తామని వేరే దేశాలకు వెళ్ళి షాపింగ్ చేసుకొస్తారు తప్ప ఏమీ నేర్చుకోరు.

--ప్రసాద్
http://blog.charasala.com

రాధిక said...

ప్రశ్నించగలం.కాని అరికట్టలేము.


Free Blogger Templates by Isnaini Dot Com and Flowers and Decors. Powered by Blogger