కాంబోడియా లో పట్టాల మీద మామూలు రైళ్ళ కంటే ఈ ఫొటోలో కనిపించే "బండి రైళ్ళు" (bamboo trains) ఎక్కువగా తిరుగుతుంటాయి.
ఇవి మన అంధ్రా లో వుండే "తోపుడు బండ్ల" లాగా వుంటాయి. వెదురుతో చేసిన బండికి చిన్న ఇనుప చక్రాలు, ఒక చిన్న ఇంజను, ఒక బ్రేకు లీవరు - ఇదీ దాని design.
ఈ చిన్న దేశంలో అసలు రైలు కంటే ఇవే ఎక్కువ పాపులర్. ఎందుకంటే సర్కారీ వారి రైలు వారానికి ఒక్కసారే వస్తుంది. దాని యొక్క అత్యధిక వేగం 10-15 కి.మీ/గం. అంటే మీరు "రన్నింగ్" లో రైలు ఎక్కి దిగవచ్చన్నమాట. కానీ మన "బండి రైలు" గంటకి 30-40 కి.మీ/గం తో పరుగెత్తుతుంది. పైగా సర్కారీ వారి రైలు కంటే చాలా చవక.
ఎప్పుడైనా సర్కారీ రైలు అడ్డం వస్తే దీనిని పట్టాల మీదనించి ఎత్తి పక్కన పెట్టి రైలు కి దారి ఇస్తారు.
ఈ మధ్యనే పొరుగు దేశాల సహాయంతొ కొత్త రైళ్ళను ప్రవేశపెట్టి రైళ్ళ పరిస్థితి ని మెరుగు పరిచే ప్రయత్నం లో వుందీ వారి ప్రభుత్వం.
ఒక 30 సంవత్సరాల క్రితం వరకూ పరిస్థితి బాగానే వుండేది. కాని "ఖ్మేర్ రోజ్" - "ఎఱ్ఱ కాంబోడియన్" - అనే కమ్మ్యూనిస్టు పాలనలొ ఆ దేశం రాతి యుగానికి వెళ్ళిపోయింది. :(
Thursday, March 29, 2007
రైలు బండి కాదిది - "బండి రైలు"
Posted by మన్యవ at 3/29/2007 12:56:00 AM
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
ayyayoa.
మీరు కంబోడియాలో వున్నారా? నాకు చాలా కాలం నుంచి అంగర్కోవాట్ దేవాలయం దర్శించాలని కోరిక. ఎలా? ఎంత అవుతుంది...ఏమి చెయ్యాలి వంటివి మీరు సూచించగలరా దయచేసి? :-)
లేదండీ నేనుండేది కాంబోడియా కాదు, సింగపూరు లో.
మీరడిగిన డీటైల్స్ కనుక్కొనే ప్రయత్నం చేస్తాను.
అబ్బో దీన్ని చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంది. ఉన్నపళమ్గా మన రైల్వే వాళ్ళని పోగుడుతూ ఒక పంచరత్నావళి రాయాలి అనిపిస్తోంది.
Post a Comment