Tuesday, July 24, 2007

హైదరాబాదు "బ్యూటిఫికేషన్" - రోడ్డు డివైడర్ల ప్రహసనం

నేను హైదరాబాదు లో సెటిల్ అయినప్పటి నుంచి చూస్తున్నాను మన హుడా వారి మాయ.

ఫస్ట్ ఏమీ లేని రోడ్డు మీద 6 అంగుళాల ఎత్తున్న డివైడర్ వేస్తారు.
తరువాత సీజన్ లో వాన పడగానే 6 అంగుళాల మందం రోడ్డు మళ్ళీ వేస్తారు. ఇప్పుడు డివైడర్ రోడ్డులో కలసి పోయిందని 12 అంగుళాల ఎత్తున్న డివైడర్ వేస్తారు.

నెక్స్ట్ సీజన్ : రోడ్డు మరో 6 అంగుళాల మందం పెంపు. డివైడర్ కూడా ఒకటిన్నర అడుగుల ఎత్తు అడుగు వెడల్పుతో ఒళ్ళు చేయటం మొదలెడుతుంది.

పై సీజన్ : మళ్ళీ తారు పూత. ఇప్పుడు డివైడర్ సైజు 2 అడుగులు ఎత్తు , 2 అడుగులు వెడల్పు. ఇక మోకాలి నొప్పుల ముసలి వాళ్ళు అది దాటలేరన్నమాట.

ఆ పై సీజన్ :రోడ్డు మరో 6 అంగుళాలు. డివైడర్: 2 1/2 అడుగులు ఎత్తు , 3 అడుగులు వెడల్పు, మధ్యలో మట్టి-అందులో మెక్కలు. ఈ పాటికి అది క్రికెట్ పిచ్ లాగా కనిపిస్తుంటుంది.

ఏడాదిన్నర తరువాత: ట్రాఫిక్ కి రోడ్డు చాలట్లేదని డివైడర్ మొత్తం తీసేసి రోడ్డు వేసేస్తారు.

ప్రతి రోడ్డుదీ ఇదే పరిస్థితి. బ్యూటిఫికేషన్ పేరుతో జరుగుతున్న ఈ దోపిడీ ని మనం ప్రశ్నించలేమా? అరికట్టటం ఎలా?

విఫలమైన ఐక్యతా ఉద్యమాలు


Free Blogger Templates by Isnaini Dot Com and Flowers and Decors. Powered by Blogger